రాజమౌళి తన సినిమాలకు కథలు, సీన్లు చాలా తెలివిగా వివిధ భాషల సినిమాల నుంచి తెచ్చుకుంటాడు. కొట్టేస్తాడని, కాపీ కాట్ అని అంటే కాదు, ఇన్సిపిరేషన్ అంటాడు రాజమౌళి. మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలిలో జలపాతం ఎక్కడ ఇలా అన్నింటికీ హాలీవుడ్ మూలాలు వున్నాయి. మగధీర కథ కోసం తన నవలను కొట్టేసారన్న ఓ రచయిత కేసూ వుండేది.
ఇప్పడు తాజగా బాహుబలి 2కి సంబంధించి ఓ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో తిరుగుతోంది. బాహుబలి 2లో ఓ యుద్ద సన్నివేశంలో బర్రెల కొమ్ములకు గుడ్డలు కట్టి మండించి, భారీగా తోలే సీన్ ఒకటి వుంది. ఆ సీన్ కు ఒరిజినల్ సీన్ ఇదంటూ ఆ వీడియో చక్కర్లు కొడుతోంది.
మార్కో పోలో సెషన్ 2 వార్ ఎగెనిస్ట్ క్రూసేడర్స్ అనే ఈ క్లిప్పింగ్ చూసిన వాళ్లకు బాహుబలిలో ఇంకెన్ని సీన్లు ఇంకెక్కడి నుంచి కొట్టుకు వచ్చారో? అదే ఇన్సిపిరేషన్ పొందారో అన్న అనుమానాలు తలెత్తడం ఖాయం.