సినిమా జనాలు కూడా మనుషులే. వారికి మనసులుంటాయి..నచ్చిన వాళ్లతో చెట్టాపట్టాలేసుకోమంటాయి. అందుకే మరో సినిమా జంట చెట్టాపట్టాలేసుకుని చెట్టు నీడ కోసం కాకున్నా, పార్టీలు, షాపింగ్ లకు తిరుగుతోందట.
Advertisement
ఇందులో అమ్మడు ఓ సినిమాలో హీరోయిన్ గా చేసింది. అబ్బాయి హీరో గా ట్రయ్ చేసి, క్లిక్ కాలేక, మంచి మంచి క్యారెక్టర్లు దొరికితే చేస్తున్నాడు. ఒకరికి ఒకరు నచ్చారు. ప్రేమో, స్నేహమో తెలియదు కానీ, హాయిగా కలిసి కబుర్లు చెప్పేసుకుంటున్నారట. వాళ్లకి ఇష్టమైనపుడు ఇంకెవరికైనా ఎందుకు అభ్యంతరం వుంటుంది చెప్పండి.