నితిన్‌ రేంజ్‌ బాగా పెరిగింది

హిట్‌ టాక్‌ వచ్చిన సినిమాకి కలెక్షన్లు రాబట్టడంలో విశేషం లేదు. మొదటి రోజే వీక్‌ టాక్‌ తెచ్చుకుని.. ఫ్లాప్‌ అయిపోతుందని తీర్మానించబడ్డ చిత్రాన్ని సేఫ్‌ జోన్‌కి తీసుకెళ్లడంలోనే ఒక హీరో రేంజ్‌ ఏంటనేది తెలుస్తుంది.…

హిట్‌ టాక్‌ వచ్చిన సినిమాకి కలెక్షన్లు రాబట్టడంలో విశేషం లేదు. మొదటి రోజే వీక్‌ టాక్‌ తెచ్చుకుని.. ఫ్లాప్‌ అయిపోతుందని తీర్మానించబడ్డ చిత్రాన్ని సేఫ్‌ జోన్‌కి తీసుకెళ్లడంలోనే ఒక హీరో రేంజ్‌ ఏంటనేది తెలుస్తుంది. ఎనిమిదేళ్ల పాటు విజయాలు లేక డీలా పడ్డ నితిన్‌ ఇప్పుడు ఫ్లాప్‌ టాక్‌ వచ్చిన చిత్రాన్ని కూడా మంచి రేంజ్‌కి తీసుకెళ్లాడు. 

‘చిన్నదాన నీకోసం’ చిత్రానికి బిలో యావరేజ్‌ టు ఫ్లాప్‌ టాక్‌ వచ్చినా కానీ ప్రేక్షకులు దీనికే పట్టం కట్టారు. ముఖ్యంగా నైజామ్‌లో ఈ చిత్రం సూపర్‌ కలెక్షన్స్‌ రాబడుతోంది. మిగిలిన ఏరియాల్లో కూడా నెమ్మదిగా యావరేజ్‌ రేంజ్‌కి చేరుకున్న ఈ చిత్రం ఈ వీకెండ్‌లో కూడా స్ట్రాంగ్‌గా నిలబడితే అందర్నీ సేఫ్‌ జోన్‌లోకి తీసుకెళుతుంది. 

నితిన్‌ గత చిత్రం ‘హార్ట్‌ ఎటాక్‌’ కూడా కమర్షియల్‌గా ఫర్వాలేదనిపించుకుంది. ‘చిన్నదాన నీకోసం’ ఆల్రెడీ యావరేజ్‌ రేంజ్‌కి చేరుకుంది. మరో నాలుగైదు రోజులు కలెక్షన్లలో డ్రాప్‌ లేకపోతే హిట్‌ స్టేటస్‌ దక్కించుకోవడం ఖాయమవుతుంది.