ఎన్ని సినిమాల్లో రీమిక్స్ చేసారో..ఎన్ని జబర్దస్థ్ కామెడీ స్కిట్లలో రీమిక్స్ చేసారో. ఇలా మొత్తం మీద ఖుషీలో పవన్-భూమిక సీన్ ను ఎడాపెడా వాడేసారు. బాగున్నవి బాగున్నాయి. అభాసయినవి అభాసయ్యాయి.
అయినా ఆ సీన్ ను మళ్లీ మరోసారి రీక్రియేట్ చేయాలని ముచ్చటేసింది అంటే ఏమనుకోవాలి? మెగాస్టార్ లేటెస్ట్ సినిమా భోళాశంకర్ లో ఖుషీ బొడ్డు సీన్ మళ్లీ రీమిక్స్ చేసారని, ఆయన ఆ సినిమాలో పవన్ ఫ్యాన్ గా కనిపిస్తారని ఇప్పటికే వార్తలు వచ్చేసాయి.
అయితే ఇన్ సైడ్ సర్కిళ్లలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇది పూర్తిగా మెగాస్టార్ స్వంత ఐడియా అని తెలుస్తోంది. ఆ మధ్య సుమ అడ్డా షో కి వెళ్లారు చిరు. అదే షో లో ఇలాంటి సీన్ ను సరదాగా ప్రెజెంట్ చేసారు. తరువాత ఇదే సీన్ ను సినిమాలో పెడితే ఎలా వుంటుందనే ఐడియా వచ్చినట్లు తెలుస్తోంది. అనుకోవడం తడువుగా అమలు చేసేసారు. ఇప్పటికే చిత్రీకరణ కూడా పూర్తయిపోయింది.
వాల్తేర్ వీరయ్య హిట్ తరువాత మెగాస్టార్ కు ఫ్యాన్స్ తన సినిమా ఎలా వుండాలనుకుంటున్నారో క్లారిటీ వచ్చేసినట్లు కనిపిస్తోంది. అందుకే భోళా శంకర్ సినిమాను ఫుల్ గా ఆ రూట్లోనే నడిపించేస్తున్నారేమో. ఏమైతేనేం శ్రీముఖి కి మెగాస్టార్ పక్కన ‘బొడ్డు సీను’ చేసే అదృష్టం దక్కింది.