ఇక యాక్టివ్ డైరక్టర్స్ గిల్డ్?

టాలీవుడ్ లో కొత్త కొత్త సంఘాలు పుట్టుకువస్తున్నాయి. ఉన్నసంఘాలతో వేగలేని వారు, వేరే సంఘం పెడతారు. నిర్మాతల మండలిలో ఎప్పటి నుంచో వున్నవారు ఎందరో వున్నారు. వీళ్లలో సినిమాలు తీయని వారు, జమానా కాలం…

టాలీవుడ్ లో కొత్త కొత్త సంఘాలు పుట్టుకువస్తున్నాయి. ఉన్నసంఘాలతో వేగలేని వారు, వేరే సంఘం పెడతారు. నిర్మాతల మండలిలో ఎప్పటి నుంచో వున్నవారు ఎందరో వున్నారు. వీళ్లలో సినిమాలు తీయని వారు, జమానా కాలం నుంచి వుంటున్నవారు, కేవలం ఇన్స్యూరెన్స్ కోసం కొనసాగుతున్నవారు ఎక్కువగా వున్నారన్న విమర్శ వుంది. పైగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే ఇక్కడ మెజారిటీ వ్యవహారం అడ్డం పడుతుంది.

అందుకే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని ఓకటి మొదలు పెట్టారు. వాస్తవానికి ముందుగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ అన్నారు. కానీ దాంట్లో కొన్ని అవకతవకలు జరిగాయని వార్తలు వచ్చాయి. మొత్తానికి ఏమయిందో కానీ, దాన్ని అలా పక్కన పెట్టి, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని స్టార్ట్ చేసారు. అందులో కూడా ఎప్పుడో నాలుగేళ్ల కిందట సినిమా తీసిన వాళ్లు కూడా వున్నారు అది వేరే సంగతి. మొత్తానికి గిల్డ్ దే ఇప్పుడు నిర్మాతల్లో హవా. ప్రకటనలు ఇవ్వడం, రేట్లు ఫిక్స్ చేయడం, విడుదల డేట్ లు డిసైడ్ చేయడం ఇలా చాలా..చాలా..

ఇప్పుడు నిర్మాతల మండలి అడుగుజాడల్లోనే దర్ళకులు కూడా నడవబోతున్నట్లు కనిపిస్తోంది. యాక్టివ్ డైరక్టర్స్ గిల్డ్ అనేది ప్రారంభిస్తారా? అన్న అనుమానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే డైరక్టర్ల సమావేశానికి దర్శకుల సంఘానికి సమాచారం కానీ, ఆహ్వానం కానీ లేదు. రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ లాంటి వాళ్ల నేతృత్వంలో ఇవి జరుగుతున్నాయి. 

ఈ విషయమై దర్శకుల సంఘం నేత శంకర్ ను ప్రశ్నించగా, ఈ సమావేశాల గురించి తమకు ఏ విధమైన సమాచారం లేదని అన్నారు. తనను కూడా సభ్యులు ఈ విషయమై అడుగుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సమావేశాలు పెట్టుకోవచ్చని ఆయన చెప్పారు.

ఇదిలా వుంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు రాజీనామా చేయకుండానే  యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ను ఏర్పాటు చేసుకున్నట్లే, దర్శకుల సంఘానికి రాజీనామా చేయకుండానే యాక్టివ్ డైరక్టర్స్ గిల్డ్ ను ప్రారంభించే యోచన చేస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ప్రత్యేకంగా పేరు ఏమీ పెట్టకుండా, ఇలా కొనసాగుతారని తెలుస్తోంది.

ఇన్ని పనులు చేసిన ముఖ్యమంత్రిని చూడలేదు

ఛాన్స్ కోసం ఎదురు చూసిన ఈనాడు