ఇక బిగ్ బాస్ హైదరాబాద్ లోనే

బిగ్ బాస్ షో ఎంత పెద్ద హిట్ అన్నది కొత్తగా లెక్కలు కట్టి చెప్పక్కరలేదు. ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్ షో, ఎన్టీఆర్ టాలెంట్ పుణ్యమా అని మాంచి రేటింగ్ తెచ్చుకుంది. ఈ బిగ్…

బిగ్ బాస్ షో ఎంత పెద్ద హిట్ అన్నది కొత్తగా లెక్కలు కట్టి చెప్పక్కరలేదు. ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్ షో, ఎన్టీఆర్ టాలెంట్ పుణ్యమా అని మాంచి రేటింగ్ తెచ్చుకుంది. ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ త్వరలో ముగియబోతోంది. ఆ తరువాత కాస్త గ్యాప్ తీసుకుని రెండో సీజన్ స్టార్ట్ చేస్తారు.

ఆ సీజన్ కు కూడా ఎన్టీఆర్ నే హోస్ట్ గా వుంటారు. అది ఆల్ రెడీ ఫిక్సయిపోయింది. అగ్రిమెంట్ ఇంకా కాలేదు కానీ ఆయనే వుంటారన్నది పక్కా అయిపోయింది. అయితే ఫస్ట్ సీజన్ కు ఆదరణ ఎలా వుంటుందో అంచనా వేయలేక, ఇన్వెస్ట్ చేయడం అనవసరం అన్న ఉద్దేశంతో షో ను పూణే సమీపంలో ఆల్రెడీ వేసిన సెట్ లో నిర్వహించారు. 

కానీ దీనివల్ల ఓ సమస్య వస్తోంది. ప్రతి వారం హైదరాబాద్ నుంచి పూణే కు ఎన్టీఆర్ షటిల్ చేయాల్సి వస్తోంది. అందువల్ల సీజన్ 2 నుంచి బిగ్ బాస్ కోసం హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా, పర్మనెంట్ సెట్ నిర్మించాలని స్టార్ గ్రూప్ ఆలోచిస్తోంది. బిగ్ బాస్ సీజన్ వన్ కు ఎన్టీఆర్ కు రెమ్యూనిరేషన్ భారీగానే ఇచ్చారు.

అయితే సీజన్ టూ త్రీ ఫోర్ లకు కలిపి ఒకటే ఫ్యాకేజ్ గా అగ్రిమెంట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు బోగట్టా. సల్మాన్ కు బాలీవుడ్ లో అలాగే చేసారు. ఈ ప్యాకేజ్ ఫిక్స్ అయితే హైదరాబాద్ లో సెట్ నిర్మించే పనులు షురూ చేస్తారు.