రాజమౌళీ.. మీకు అవసరమా?

దర్శకుడు రాఘవేంద్రరావుకు మౌన ముని అని పేరు. ఆయన అస్సలు మాట్లాడేవారు కాదు. పైగా ఆ రోజుల్లో ట్విట్టరూ లేదు, వాట్సప్పూ లేదు. అభిప్రాయాలు షేర్ చేసుకోవడానికి. అందువల్ల ఆయన మాటకు ఓ వాల్యూ…

దర్శకుడు రాఘవేంద్రరావుకు మౌన ముని అని పేరు. ఆయన అస్సలు మాట్లాడేవారు కాదు. పైగా ఆ రోజుల్లో ట్విట్టరూ లేదు, వాట్సప్పూ లేదు. అభిప్రాయాలు షేర్ చేసుకోవడానికి. అందువల్ల ఆయన మాటకు ఓ వాల్యూ వుండేది. పలుకే బంగారంలా వుండేది. మరి ఆయన స్కూలు నుంచి వచ్చిన ఆయన శిష్యుడే రాజమౌళి. కానీ ఈ మధ్య ఆయన గాడి తప్పుతున్నారు.

తన ఆప్తుడు సాయి కొర్రపాటి కోసం ఏమయినా మాట్లాడొచ్చు, ట్వీట్లు చేయచ్చు. జనం అర్థం చేసుకుంటారు. లేదూ రాజీవ్ కనకాల లాంటి ఫ్రెండ్ కోసం, యేలేటి చంద్రశేఖర్ లాంటి దర్శకుడి కోసం ట్వీట్లు చేయచ్చు. పరవాలేదు. కానీ పైసా వసూల్ లాంటి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాకు కూడా రాజమౌళి భళి.. భళి.. భళిరా భళి అన్నట్లు ట్వీట్లు చేస్తే ఎలా? 

కోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ అంటూ ట్వీట్ చేయడం రాజమౌళి లాంటి ఓ స్థాయి వున్న దర్శకుడికి తగనిది. కానీ ఆయన ట్వీటేసాడు. దీంతో జనం ట్విట్టర్ లో ఓ రేంజ్ లో కౌంటర్లేస్తున్నారు. ఆ కౌంటర్లు ఎక్కడి దాకా వెళ్లాయంటే, పాపం, రాజమౌళికి కులపిచ్చను అంటగట్టేంత వరకు. పాపం రాజమౌళి చరణ్ తోనూ, ప్రభాస్ తోనూ, కమెడియన్ సునీల్ తోనూ సినిమాలు చేసిన వాడు. ఆయనకు కులపిచ్చ అంటించడం ఏమిటి? కానీ ఏం చేస్తాం. ఆయన ట్వీటు తెచ్చిన ఫలితం ఇది.