పవన్ మళ్లీ నాన్న అవుతున్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన అధిపతి. నలభై అయిదేళ్ల ఈ టాప్ హీరో మరోసారి తండ్రి కాబోతున్నారన్న గ్యాసిప్ వినిపిస్తోంది. ఆయన మూడో భార్య ప్రస్తుతం గర్భవతి అని రూమర్ వినిపిస్తోంది. డాక్టర్లు…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన అధిపతి. నలభై అయిదేళ్ల ఈ టాప్ హీరో మరోసారి తండ్రి కాబోతున్నారన్న గ్యాసిప్ వినిపిస్తోంది. ఆయన మూడో భార్య ప్రస్తుతం గర్భవతి అని రూమర్ వినిపిస్తోంది. డాక్టర్లు అక్టోబర్ 14న డెలివరీ డేట్ అంచనాగా ఇచ్చారని వినికిడి.

ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా షూట్ లో బిజీగా వున్న పవన్ యాభై రోజుల విదేశీ షూట్ కూడా చేయాల్సి వుంది. ఆ షెడ్యూలు మధ్యలోనే ఈ అక్టోబర్ 14 డేట్ వుంది. అందుకే అవసరం అయితే తాను అక్టోబర్ 14 వేళకు కాస్త ముందుగా షూటింగ్ ఆపి వెనక్కు వస్తానని, రెండు మూడు రోజులు గ్యాప్ తీసుకుని మళ్లీ షూట్ లో పాల్గొంటానని పవన్ ముందే యూనిట్ కు చెప్పినట్లు తెలుస్తోంది. అంత వరకు యూనిట్ మాత్రం విదేశాల్లోనే వుంటుంది. 

పవన్ ఇప్పటికే రెండో భార్య రేణు దేశాయ్ ద్వారా ఇద్దరు పిల్లలు వున్నారు. ఒక బాబు, ఒక పాప. మూడో భార్యకు ఓ పాప వుంది. ఈ వార్త నిజమైతే, పవన్ మొత్తం నలుగురు పిల్లల తండ్రి అవుతారు అక్టోబర్ 14 నాటికి.