బాలీవుడ్ బ్యూటీ రాణీముఖర్జీ తాజాగా ‘మర్దానీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కన్పించబోతోంది రాణీముఖర్జీ. రొమాంటిక్ గర్ల్‌గా చాలా సినిమాల్లో హల్‌చల్ చేసిన రాణి, వయసు మీద పడ్డంతో ఈ తరహా పాత్రల్ని ఎంచుకుంటోందిప్పుడు.
‘మర్దానీ’ తర్వాత కూడా యాంగ్రీ లేడీ పాత్రలే కావాలంటూ, ఆ తరహా కథలతోనే తన వద్దకు రమ్మంటోంది దర్శక నిర్మాతల్ని రాణీ ముఖర్జీ. ఆమె తీరు పట్ల బాలీవుడ్ సినీ జనం ఆశ్చర్యపోతున్నారు. కాస్త హైటుంటే.. యాంగ్రీ లేడీ పాత్రలకు ఓకేగానీ, హైట్ పెద్ద మైనస్ కావడంతో ఆ తరహా పాత్రలు ఆమెకు అంత సూట్ కావని పెదవి విరుస్తున్నారు బాలీవుడ్ సినీ జనం.
రాణీ ముఖర్జీ మాత్రం, హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ చూసిన తాను, ఇప్పుడు బాధ్యతాయుతమైన పాత్రల్లో కన్పించాలనుకుంటున్నాననీ, అదే సమయంలో అన్ని రకాల పాత్రలూ చేస్తాననీ, యాంగ్రీ లేడీ పాత్రలపై ఆసక్తి వున్నమాట వాస్తవమేననీ చెప్పుకొచ్చింది. చూద్దాం.. ‘మర్దానీ’ ఏ తరహా విజయాన్ని ఆమెకు అందిస్తుందో, ఆ తర్వాత ఆమె ఎలాంటి సినిమాలు చేయనుందో.!