cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇండస్ట్రీ కమ్మవారంతా ఫుల్ హ్యాపీ

ఇండస్ట్రీ కమ్మవారంతా ఫుల్ హ్యాపీ

ఎవరు నమ్మినా..నమ్మకున్నా ఇది నిజం. మా ఎన్నికల పోరు చివరివారానికి చేరేసరికి కమ్మ..కాపు ఆధిపత్య పోరుగా మారిపోయింది. మంచు విష్ణు పోటీలో నిల్చున్నపుడు అంతగా లేని కులాల పోరు పోలింగ్ తేదీ దగ్గరకు వెళ్లే సరికి రెండు సామాజిక వర్గాల మధ్య పోరుగా మారిపోయింది. 

నిజానికి మంచు విష్ణు వైకాపా నేత జగన్ బంధువు కావడంతో, తమవారు జగన్ వెనుక వెళ్లని కొందరు కమ్మవారే చెప్పడం మొదలయింది. కానీ అదంతా పైపై మాటలు అని, టాలీవుడ్ పై తమ ఆధిపత్యం ఎప్పటికీ తగ్గదని రుజువు చేయ డానికి ఇదో అవకాశం అని కమ్మవారు లోలోపల ఫీల్ అవుతున్నట్లు లోపాయికారీ వార్తలు వినవస్తూనే వున్నాయి. 

ఎప్పుడయితే వ్యవహారం ఇలా వుంది అని ఉప్పు అందిందో, ప్రకాష్ రాజ్ వర్గం నుంచి నాగబాబు అలెర్ట్ అయిపోయారు. తమ వర్గం అంతా ప్రకాష్ రాజ్ వెనక్క రావాల్సిన అవసరం వుందని ఆయనకు అర్థం అయింది. అంతవరకు ఓపెన్ కాని ఆయన ఓపెన్ గా బయటకు వచ్చారు. దాంతో వ్యవహారం మొత్తం రివర్స్ అయిపోయింది.

తెరవెనుక కమ్మవారు ఏకం అయిపోయారు. చిరకాలంగా టాలీవుడ్ మీద తమ ఆధిపత్యం తగ్గిపోతోందన్న బాధ ఒకటి అంతర్లీనంగా వుంది. తమ పట్టు చాటుకునేందుకు ఇదో అవకాశంగా అందివచ్చింది. విష్ణు అంటే అభిమానమా? ప్రకాష్ రాజ్ అంటే అభిమానం లేదా? అన్న పాయింట్ కాదు ఇక్కడ పనిచేసింది కులం ఒక్కటే.

విష్ణు గెలుపు తరువాత పలువురు బాహాటంగా తమ అభిప్రాయాలు వెల్లడించడం మొదలుపెట్టారు. కోటా శ్రీనివాసరావుపై నాగ బాబు కామెంట్లు ఆసరాగా తీసుకుని ఆయనను దుయ్య బట్టడం ప్రారంభించారు. అదే అసలు ప్రకాష్ రాజ్ ఓటమికి కారణం అన్నట్లుచెబుతూనే, ఇన్నాళ్ల తరువాత తమ సత్తా చాటడానికి తమకు అవకాశం వచ్చిందని ఒప్పుకుంటుున్నారు.

మరోపక్కన ట్విట్టర్ లో యాంటీ మెగా ఫ్యాన్స్ ఓ లేవెల్ లో వాయిస్తున్నారు. ముఖ్యంగా ప్రో వైకాపా జనాలు, కమ్మవారికి మద్దుతగా పవన్ మాట్లాడిన మాటలు గుర్తు చేస్తూ, భలేగా చేసారు అని ఎత్తి పొడుస్తున్నారు. మొత్తానికి మా ఎన్నికలు మరోసారి టాలీవుడ్ లో కమ్మవారు తలుచుకుంటే కట్టుబాటుగా ఏ విధంగా వుండగలరో రుజువు చేసాయి.

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×