డ్రగ్స్ తీసుకున్న ముస్లింను అరెస్ట్ చేయకూడదా?

ఓవైపు ఆప్ఘనిస్తాన్ లో డ్రగ్స్ కు బానిసలయ్యారంటూ కొంతమంది యువకులను తాలిబన్లు ఎలా వేధిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. డ్రగ్స్ తీసుకున్నవారు సమాజ వినాశకారులుగా మారిపోతారని ఇస్లాం నమ్మకం. అందుకే ఇస్లాం చట్టాల ప్రకారం వారందర్నీ…

ఓవైపు ఆప్ఘనిస్తాన్ లో డ్రగ్స్ కు బానిసలయ్యారంటూ కొంతమంది యువకులను తాలిబన్లు ఎలా వేధిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. డ్రగ్స్ తీసుకున్నవారు సమాజ వినాశకారులుగా మారిపోతారని ఇస్లాం నమ్మకం. అందుకే ఇస్లాం చట్టాల ప్రకారం వారందర్నీ జైలులాంటి ఇరుకు గదుల్లో వేసి భోజనం లేకుండా మాడ్చేస్తున్నారు తాలిబన్లు.

మరి అదే ఇస్లాం భారత్ లో ఏం చెబుతోంది. భారత్ లో మాత్రం ముస్లింలు డ్రగ్స్ తీసుకోవచ్చా..? మరి తీసుకుంటే వారిపై విచారణ చేపట్టకూడదా..? ఒకవేళ విచారణ పేరుతో జైలులో వేస్తే అప్పుడు మతం గుర్తుకొస్తుందా..? జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. 

ఖాన్ అనే పేరుంది కాబట్టే.. షారుఖ్ కొడుకుని ప్రభుత్వం డ్రగ్స్ కేసులతో వేధిస్తోందని ఆమె ట్వీట్ చేశారు. బీజేపీ ప్రధాన ఓటు బ్యాంక్ అయినవారి శాడిస్టు కోరికలను నెరవేర్చుకునేందుకే ముస్లింలను టార్గెట్ చేసుకున్నారని ఆరోపించారు.

ఇంటిపేరు ఖాన్ అయితే ఏంటి.. సూపర్ స్టార్ కాలేదా..?

షారుఖ్ ఖాన్ కొడుకుని ప్రభుత్వం వేధిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన మొహబూబా ముఫ్తీని ప్రస్తుతం నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ సినిమాలను కేవలం ముస్లింలే చూశారా.. బాలీవుడ్ బాద్షా గా షారుఖ్ ఎదుగుదల వెనక హిందువుల ప్రోత్సాహం లేదా అని ప్రశ్నిస్తున్నారు. శాడిస్ట్ లంటూ పరోక్షంగా హిందువులను టార్గెట్ చేసిన ముఫ్తీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

రైతులను కారుతో తొక్కించి చంపాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి కొడుకు కేసులో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని కూడా ముఫ్తీ ఆరోపించారు. 

రైతుల్ని హత్య చేసినవారిని వదిలేసి, ఖాన్ అనే పేరు ఉన్న కారణంగా 23 ఏళ్ల కుర్రాడిని వేధించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారామె. అయితే డ్రగ్స్ కేసుతో మతానికి ముడిపెట్టడం సరికాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అదే సమయంలో ముస్లింలు డ్రగ్స్ తీసుకోడాన్ని ముఫ్తీ ప్రోత్సహిస్తున్నారా అని కూడా ప్రశ్నిస్తున్నారు.