ఏదైనా సినిమా సూపర్ హిట్ అయితే తరువాత వచ్చే సినిమాలకు సమస్య. ఇది టాలీవుడ్ లో ఎప్పుడూ జరిగేదే. ఈవారం రంగస్థలం విడుదలయింది. దాదాపు 1300కు పై స్క్రీన్లలో విడుదలయింది.
ఎమ్మెల్యే, కిర్రాక్ పార్టీ, నీదీ నాదీ ఒకే కథ సినిమాలు ఇంకా థియేటర్లలో వున్నాయి. సింగిల్ స్క్రీన్ లు, డబుల్ స్క్రీన్ల దగ్గర ఈ సినిమాలు లేచిపోయాయి కానీ, ఎక్కువ స్క్రీన్లు వున్నచోట వున్నాయి. ఇలాంటి టైమ్ లో వచ్చేవారం ఛల్ మోహన్ రంగా విడుదల కావాల్సి వుంది.
సింగిల్ స్క్రీన్లు ఇప్పుడు చల్ మోహన్ రంగాకు దొరకడం కష్టం అవుతుంది. డబుల్ స్క్రీన్ లు వున్నచోట కొంత వరకు ఒకె. సోమవారం తరువాత కూడా రంగస్థలం ఓవర్ ఫ్లోస్ బాగా వుంటే అక్కడా కష్టం అవుతుంది. ఇది ఒక సమస్య.
మరోపక్క సమ్మర్ లో ఏ సినిమా చూద్దాం అనగానే జనాలకు రంగస్థలం మీదకు దృష్టిపోతుంది. సాధారణంగా ఓ జోనర్, లేదా ఓ పాథ్ బ్రేకింగ్ సినిమా వస్తే ఈ సమస్య ఎప్పుడూ వస్తుంటుంది.
సో, ఇప్పుడు ఛల్ మోహన్ రంగాకు ఒకటే దారి. అన్ని విధాలా యూత్ ఫుల్, ఫన్ ఎంటర్ టైనర్ అనిపించుకొవాలి. ట్రయిలర్లు, టీజర్లు ఆ లక్షణాలు వున్నట్లే చెబుతున్నాయి. పైగా పవన్, త్రివిక్రమ్ పేరు కూడా తోడయింది. అందువల్ల ఛల్ మోహన్ రంగాకు కాస్త ధైర్యమే. విడుదయిన తరువాత వచ్చే టాక్ రేంజ్ ను బట్టి వుంటుంది రంగస్థలం ఎఫెక్ట్ ను ఏ మేరకు తట్టుకుంటుంది అన్నది.