ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. కొరటాల దర్శకత్వం, భారీ పాన్ ఇండియా యాక్షన్ చిత్రం, జాన్వి కపూర్ తొలి తెలుగు సినిమా. అనిరుధ్ సంగీతం. అయినా ఎవరూ అస్సలు భయపడడం లేదెందుకో?
సెప్టెంబర్ 27న విడుదలవుతోందీ సినిమా. ఈ రేంజ్ సినిమా అంటే కనీసం రెండు మూడు వారాలు గ్యాప్ వదిలేస్తారు. విడుదలైన తరువాత పరిస్థితి చూసుకుని డేట్ లు వేసుకుంటారు. కానీ టాలీవుడ్ అలా అనుకోవడం లేదు. ఎవరికి వాళ్లు అక్టోబర్ డేట్ లను సినిమాతో నింపేస్తున్నారు
పీపుల్స్ మీడియా రెండు సినిమాలను అక్టోబర్ లో థియేటర్లలోకి తెస్తోంది. అందులోనూ ఒక సినిమాను జస్ట్ వారం గ్యాప్ లో వేస్తోంది. మరో వారం తిరగకుండా గోపీచంద్ విశ్వం సినిమాను ప్రకటించింది. దిల్ రాజు ఓ సినిమాను తీసుకువస్తున్నారు. అల్లరి నరేష్ బచ్చల మల్లి కూడా రావాలనే ఆలోచనలు చేస్తోంది. ఇవి కాక రజనీ పాన్ ఇండియా సినిమా వేట్టయ్యన్ కూడా దేవర వచ్చిన రెండు వారాల్లో వస్తోంది.
ఇవన్నీ కాక చిన్న చిన్న సినిమాలు చాలా అంటే డేట్ లు వేయబోతున్నాయి. దసరా కు చాలా ముందుకి దేవర డేట్ వేయడమే ఇందుకు కారణంగా కావచ్చు. దసరా సీజన్ ను క్యాష్ చేసుకోవాలని మిగిలిన సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. ఏమిటి ధైర్యం? దేవర సినిమా దసరా సీజన్ వరకు మొత్తం థియేటర్లను హోల్డ్ చేయలేదనే నమ్మకమా?
ఇప్పటి వరకు దేవర నుంచి వచ్చిన కంటెంట్ కొంత వరకు బాగానే వుంది. అలా అని అధ్భుతమైన అడియో అల్బమ్ అయితే కాదు. ఇక మిగిలింది ట్రయిలర్. తరువాత సినిమా. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే డేట్ లు వేసిన వారంతా వెనక్కు జరుగుతారేమో?
ye maatram teda kootti avg talk vachhina .. naakinchestaru ee movie ni.. telugu raastrallo overseas lo kooda
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
vc estanu 9380537747
ఎన్ని వచ్చినా మేం థియేటర్లో చూడం
Anthe kadha.. manam velu karchu petti chidalai .. vallu Range rover lo enjoy cheyali