దర్శకుడు పూరి జగన్నాధ్ సినిమాల్లో హీరో, హీరోయిన్లు కాస్త బోల్డ్ గా వుంటారు. హీరోలు రఫ్ గా వుంటే, హీరోయిన్లు బోల్డ్ గా మాట్లాడేస్తారు. వచ్చే నెలలో రాబోతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. వీళ్లలో ఓ హీరోయిన్ ఓ రేంజ్ బోల్డ్ నెస్ తో కనిపిస్తుందని తెలుస్తోంది.
ఆ హీరోయిన్ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో రెచ్చిపోతుందని టాక్. ఆ రెచ్చిపోవడంలో కూడా తిట్లు, బూతుల్లాంటి తిట్లు ఓ రేంజ్ లో వుంటాయని టాక్. అవి ఏ రేంజ్ లో వుంటాయి అంటే సెన్సారు ఓకె చేస్తే సరే కానీ, లేదూ అంటే బీప్ లు ఎక్కువ వినిపిస్తాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఇలాంటి మాస్ సినిమాలు అంటే బి సి సెంటర్లలో జనాలకు భలే హుషారుగా వుంటుంది. అమ్మాయిలు రెచ్చిపోతుంటే చూడడం, అబ్బాయిలు వీర ఆటిట్యూడ్ తో వుంటే థియేటర్ రావడం వంటి మాస్ ప్రేక్షకుల సంగతి పూరికి బాగా తెలుసు కనుకే ఆయన సినిమాల్లో పాత్రలు అలా వుంటాయి. అయితే ఈ సారి ఈ డోస్ ను మరికాస్త పెంచినట్లు కనిపిస్తోంది.