Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

అయ్య‌య్యో..బాల‌య్య ఈ హీరోయిన్ క‌ష్టాలేంట‌య్యా!

అయ్య‌య్యో..బాల‌య్య ఈ హీరోయిన్ క‌ష్టాలేంట‌య్యా!

ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి బాల‌కృష్ణ త‌దుప‌రి సినిమా విష‌యంలో! ఇప్పుడు తాజాగా చ‌ర్చ‌లోకి మ‌రో పేరు. అమ‌ల‌పాల్ అట‌. ఇది కూడా క‌న్ఫ‌ర్మేష‌న్ కాదు. 60 దాటిన హీరోలు చాలా మందే ఉన్నారు ద‌క్షిణాదిన‌. వారంద‌రూ ఇంకా యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్ర‌లే చేసేస్తూ ఉన్నారు. వారికీ హీరోయిన్ల కొర‌త ఏర్ప‌డుతూ ఉంది కానీ, ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఎటొచ్చీ బాల‌కృష్ణ‌కే మ‌రీ ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డుతున్న‌ట్టుగా ఉంది.

మిగ‌తా హీరోల క‌న్నా కాస్త వేగంగా సినిమాలు చేస్తున్నారు బాల‌కృష్ణ‌. దీంతో హీరోయిన్ల‌ను ప‌దే ప‌దే రిపీట్ చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. కొత్త వారితో చేసేందుకు బాల‌కృష్ణ‌కు అస్స‌లు ఛాయిస్ లేకుండా పోతోంది. శ్రియ‌, న‌య‌న‌తార‌, సోనాల్ చౌహాన్, అంజ‌లి, చిక్ బ‌ళాపూర్ భామ హ‌రిప్రియ‌.. వీళ్లే బాల‌కృష్ణ‌కు ఛాయిస్ అయ్యే ప‌రిస్థితి ఏర్ప‌డింది. 

కాజ‌ల్ కూడా 60 ప్ల‌స్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తోంది కానీ, బాల‌కృష్ణ‌తో ఈమె జోడీ ఊహించుకోవ‌డానికి కూడా క‌ష్టంగానే ఉండ‌వ‌చ్చు. దీంతో ఇప్ప‌టికే అటు హీరోయిన్ గా కెరీర్ ను దాదాపు ముగించుకున్న అమ‌ల‌పాల్ ను ఛాయిస్ గా తీసుకున్న‌ట్టున్నారు. 

60 ప్ల‌స్ హీరోలంద‌రికీ హీరోయిన్లు స‌మ‌స్య‌గా మారినా, బాల‌కృష్ణ‌కు మ‌రి కాస్త ఇబ్బంది కొన‌సాగుతూ ఉంది. అందులోనూ బాల‌కృష్ణ ఏ సినిమా చేసినా అందులో మినిమం ఇద్ద‌రు హీరోయిన్లు త‌ప్ప‌నిస‌రి! వీలైతే ముగ్గురు కూడా ఉంటారు. క‌నిపించ‌గానే వాళ్లంతా సినిమాలో ఈ హీరో మీద మ‌న‌సు విసిరేసుకుంటూ ఉండేలా బోలెడ‌న్ని సీన్లుంటాయి. ఇలాంటి నేప‌థ్యంలో.. ఒక్కో సినిమాలు ఒకరికి ఇద్ద‌రు హీరోయిన్ల‌ను ఎంచుకోవాల్సిన ప‌రిస్థితి కూడా ఏర్ప‌డుతున్న‌ట్టుగా ఉంది. 

అవ‌త‌ల మ‌ల‌యాళంలో 60 దాటిన హీరోలు హీరోయిన్ల విష‌యంలో త‌మ ప్రాథ‌మ్యాల‌ను మార్చేసుకుంటున్నారు. త‌మ స‌ర‌స‌న న‌టించే న‌టీమ‌ణుల గ్లామ‌ర్ ను వాళ్లు ప‌ట్టించుకోవ‌డం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల త‌ర‌హా వాళ్లు అక్క‌డ స్టార్ హీరోల ప‌క్క‌న క‌నిపిస్తూ ఉన్నారు. మ‌రి కొన్ని సినిమాల్లో అయితే హీరోకి లేడీ పెయిరే లేకుండా లాగించేస్తూ ఉన్నారు. బ‌హుశా హీరోయిన్ల కొర‌త నేప‌థ్యంలో తెలుగు 60 ప్లస్ హీరోలు కూడా ఆ రూట్లో ప‌య‌నించాలేమో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?