జగన్ సినీ అభినందన లేనట్లే

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని అభినందించే ఆలోచన, సన్మానించే ఐడియా టాలీవుడ్ జనాలకు వున్నట్లు కనిపించడం లేదు. టాలీవుడ్ లో మనసుల్లో చంద్రబాబును నింపేసుకున్న జనాలే ఎక్కువ. కొద్దిమంది మాత్రమే వైఎస్…

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని అభినందించే ఆలోచన, సన్మానించే ఐడియా టాలీవుడ్ జనాలకు వున్నట్లు కనిపించడం లేదు. టాలీవుడ్ లో మనసుల్లో చంద్రబాబును నింపేసుకున్న జనాలే ఎక్కువ. కొద్దిమంది మాత్రమే వైఎస్ వైపు వుండేవారు అప్పట్లో. ఇప్పుడు కూడా ఆ కొద్దిమందే జగన్ వైపు వుంటున్నారు.

అందుకే ఎవ్వరూ కిక్కురుమనడం లేదు. సన్మానం లేదా అభినందన ఆలోచన చేయడంలేదు. పిల్లి మెడలో గంట మాదిరిగా ఎవరికి వారే మౌనంగా వున్నారు. ముందుగా ఎవరు మాట్లాడితే వారితే తప్పు అవుతుందంటారేమో? అని మాట్లాడడం లేదు.

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మాత్రం ప్రమాణస్వీకార సభకు వెళ్లి వచ్చారు. సినిమా పెద్దలు పూనుకుంటే మిగిలిన వారు సై అంటారు. అరవింద్ గారు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మనిషి. తానేమన్నా అంటే వాళ్లు ఎక్కడ ఫీల్ అవుతారో అని ఆయన మాట్లాడరు.

సురేష్ బాబుకు వున్న టీడీపీ అనుబంధం అందరికీ తెలిసిందే. కెఎల్ నారాయణ, జెమిని కిరణ్ ఇలాంటి వారంతా కూడా దేశంతో అనుబంధం వున్నవారే. ఇంకెవరైనా ప్రతిపాదనతో ముందుకు వెళ్లాలన్నా, వీళ్లంతా ఏమనుకుంటారో అన్న ఫీలింగ్ ఒకటి.

మా అసోసియేషన్ యాంటీ వైకాపా గ్రూప్ అని టాక్ అప్పట్లోనే వచ్చింది. అందవల్ల వాళ్లు కూడా ఆ ఆలోచన చేయరు. కానీ ఆంధ్రలో స్థలాలు ఇస్తాం.. అని జగన్ ఒక్కమాట అంటే మాత్రం అందరూ ఎగేసుకుని వెళ్తారు. కానీ జగన్ కు గత పదేళ్లలో ఎవరు మనవాళ్లు, ఎవరు కాదు అన్నదాంట్లో ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

అందువల్ల అలా అనకపోవచ్చు. మంత్రి వర్గం ఏర్పడిన తరువాత సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు అవుతారో చూసి, అప్పుడు సన్మానానికి దిగుతారేమో? అన్నీ బాగానే వున్నాయి. మరి పెద్ద సినిమాలకు అయిదు షోలకు అనుమతులు, రేట్లు రెండు వందలకు పెంచడాలు వంటి వ్యవహారం వచ్చినపుడు మాత్రం జగన్ గుర్తుకు వస్తారేమో?

కోట్లు పెట్టుబడి పెట్టి.. అవినీతి రహిత పాలనకు ఒప్పుకుంటారా?