ప్రస్తుతం చాలా సేఫ్ పొజిషన్ లో ఉన్నాడు. అతడికంటూ ఓ మార్కెట్ ఉంది. బయ్యర్లకు అతడి సినిమాలపై ఓ నమ్మకం ఉంది. ఇలాంటి టైమ్ లో రిస్క్ చేయాల్సిన అవసరం నానికి లేదు. అయినప్పటికీ అతడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. ఒక విధంగా చెప్పాలంటే ఇది రిస్కే కదా.
బ్రహ్మోత్సవం సినిమా తర్వాత అడ్డాలకు అవకాశమిచ్చిన నాధుడు లేడు. చాలామంది హీరోల్ని కలిశాడు, 2-3 కథలు చెప్పాడు. కానీ ఎవరూ శ్రీకాంత్ కు ఛాన్స్ ఇవ్వలేదు. ఆల్రెడీ చేతిలో ఉన్న అడ్వాన్స్ కారణంగా గీతాఆర్ట్స్ బ్యానర్ లోనే అలా కొనసాగుతూ వస్తున్నాడు ఈ దర్శకుడు. అలాంటి దర్శకుడికి నాని అవకాశం ఇచ్చాడంటే అది గొప్ప విషయమే మరి.
ప్రస్తుతానికైతే ఈ మేటర్ పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఫలానా హీరోతో శ్రీకాంత్ అడ్డాల సినిమా చేయబోతున్నాడంటూ ఇప్పటికే పలు పుకార్లు వచ్చాయి. నాని పేరు కూడా అలా పుకార్ల లిస్ట్ లో చేరుతుందా లేక నిజం అవుతుందా అనేది మరికొంతకాలం ఆగితే తప్ప చెప్పలేం.
అన్నట్టు శ్రీకాంత్ అడ్డాల దగ్గర అడ్వాన్స్ ఉన్నట్టుగానే, నాని వద్ద కూడా గీతాఆర్ట్స్ అడ్వాన్స్ ఉంది. అందుకే ఈ గాసిప్ మొదలైందేమో.