సిఎమ్ జగన్ ఓ జీవో ఇచ్చారు అంటే ఆంధ్ర అంతటా అమలు కావాల్సిందే. అమలయ్యేలా అధికారులు చూడాల్సిందే.కానీ సిఎమ్ ఇంట్లో వాళ్లే దాన్ని ధిక్కరిస్తే ? అధికారులు ఏం చేయగలరు. సినిమా టికెట్ ల రేట్లు తగ్గిస్తూ సిఎమ్ జగన్ ఇచ్చిన జీవో విషయంలో ఇలాగే జరిగిందని టాలీవుడ్ వర్గాల బోగట్టా.
సిఎమ్ సమీప బంధువు ఒకరికి కడపలో థియేటర్లు వున్నాయి. వాటిల్లో వకీల్ సాబ్ సినిమాను ప్రదర్శించారు. ఆ థియేటర్లతో నిర్మాత దిల్ రాజుకు వ్యాపార బంధాలో, అగ్రిమెంట్ లో వున్నాయిని తెలుస్తోంది. లేదా పెద్ద సినిమా అని వేసి వుండొచ్చు. అందరి మాదిరిగానే 200 యూనిఫారమ్ టికేట్ పెట్టారు.
కానీ ఆ సదరు బంధవు మాత్రం ఆ జీవోను బేఖాతరు చేసి, రెండు వందల రేటునే కంటిన్యూ చేసినట్లు తెలుస్తోంది. ఎప్పుడయితే ఆయన అలా చేసారో రాయలసీమలోని చాలా మంది ఎగ్జిబిటర్లు అదే బాట పట్టారు. ఇక్కడ ఏమీ అనలేరు కనుక, అక్కడా ఏమీ అనలేకపోయారు అధికారులు.
మదనపల్లి, కర్నూలు లొని కొన్ని థియేటర్లు మినహా మిగిలిన అంతా అదే బాట పట్టారని తెలుస్తోంది. ఆ విధంగా సీమ నుంచి వచ్చిన సిఎమ్ ఇచ్చి జీవో కు ఆ సీమలొనే చెల్లుబాటులేకుండా పోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.