బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్లకే మాజీ బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ ఉంటోంది. ఇలాంటి జాబితాను కలిగి ఉన్న వారిలో జాన్వీ కపూర్ ఒకరు. ప్రస్తుతం జాన్వీ కపూర్ మాల్దీవుల టూర్లో సేదతీరుతూ ఉంది.
ఈ మధ్యకాలంలో ఓ మోస్తరు రేంజ్ హీరోయిన్లే మాల్దీవులను చుట్టేస్తున్నారు. అక్కడ బీచ్ లలో ఫొటోలు దిగి పోస్టులు పెడితే ఇన్ స్టాగ్రమ్ లో ఫాలోయర్ల సంఖ్య సునాయాసంగా పెరుగుతుందనే లెక్కలతో.. చాలా మంది మాల్దీవుల టూర్ ను పెట్టుకుంటూ ఉంటారు. జాన్వీ కపూర్ ఈ లెక్కలతో వెళ్లిందో లేదో కానీ.. మాజీ బాయ్ ఫ్రెండ్ ఆమె ఈ టూర్లో ఉన్నాడనే టాక్ వస్తోంది.
అందుకు ముఖ్యకారణం వీరిద్దరూ ఒకేసారి, మాల్దీవుల్లోని దాదాపు ఒకే లోకేషన్ నుంచి పోస్టులు, స్టోరీలు పోస్టు చేస్తూ ఉండటం! ఇప్పుడు జాన్వీ వెంట ఉన్నాడనే ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ మరెవరో కాదు, శిఖర్ పహారియా! ఇతడెవరు? అనొద్దు. మహారాష్ట్ర మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు ఇతడు. రిచ్ కిడ్. షిండే మనవడు అనే గుర్తింపు కన్నా, జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ అనే గుర్తింపుతోనే బాగా పేరు తెచ్చుకున్నాడు.
అయితే కొన్నాళ్ల కిందట వీరు బ్రేకప్ చెప్పుకున్నట్టుగా ప్రచారం జరిగింది. జాన్వీ కపూర్ మాజీ బాయ్ ఫ్రెండ్ అయ్యాడు పహారియా. అయితే బ్రేకప్ తర్వాత కూడా వీరు పూర్తిగా దూరం కానట్టుగా ఉందనే అభిప్రాయాలకు కారణం అవుతోంది జాన్వీ తాజా టూర్.