ఇప్పటికే 3సార్లు పెళ్లి చేసుకుంది హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలీ. ఇప్పుడు నాలుగోసారి పెళ్లికి రెడీ అవుతోందట. హాలీవుడ్ లో ఇలా సీజన్ కు ఒకసారి మొగుడ్ని మార్చేయడం కామనే. కాకపోతే ఇక్కడున్నది స్టార్ జంట. ఏకంగా స్టార్ హీరో బ్రాడ్ పిట్ కే విడాకులు ఇవ్వాలనుకుంటోంది ఏంజెలీనా. అదే ఇప్పుడు సెన్సేషనల్ న్యూస్.
బ్రాడ్ పిట్, ఏంజెలినాది హాట్ జోడీ. వీళ్ల కాంబినేషన్ కు బ్రాంజెలినా అనే ముద్దుపేరు కూడా ఉంది. అలాంటి హాట్ కపుల్ ఇప్పుడు విడాకులకు రెడీ అవుతోందట. నిజానికి గతేడాది డిసెంబర్ నుంచే వీళ్లిద్దరూ కలిసి ఉండడం లేదు. రీసెంట్ గా ఆమె చేసిన ట్వీట్స్ కూడా వీళ్లిద్దరూ విడిపోయారనే విషయాన్ని చెబుతున్నాయి. 41 ఏళ్ల జోలీ.. లండన్ కు చెందిన ఓ పారిశ్రామికవేత్తతో డేటింగ్ చేస్తోందని టాక్. త్వరలోనే అతడ్ని పెళ్లాడుతుందట.
పిట్, జోలీ మరో 2 నెలల్లో విడిపోతారనే ప్రచారం జరుగుతోంది. అదే కనుక జరిగితే కాస్ట్ లీ విడాకుల జాబితాలో వీళ్లు కూడా చేరిపోతారు. విడాకుల ఒప్పందంలో భాగంగా జోలీకి చెందిన భారీ ఎస్టేట్ ను పిట్ కొనుగోలు చేసి, తమ ఇద్దరికీ కామన్ గా ఉన్న పిల్లలకు దాన్ని ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడట. బ్రాంజెలీనా దంపతులకు ఆరుగురు సంతానం. వీళ్లలో ముగ్గుర్ని ఈ జంట దత్తత తీసుకుంది.