జూన్ 1 నుంచి షూటింగ్ లు?

మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా వున్నా, తెలంగాణకు వున్న మరో సమస్య సినిమా షూటింగ్ లు. ఇప్పటికిప్పుడు సినిమా షూటింగ్ లు మొదలు కాకపోతే మూడు చాలా సినిమాలు మూలన పడిపోతాయి. ఆర్ఆర్ఆర్  లాంటి…

మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా వున్నా, తెలంగాణకు వున్న మరో సమస్య సినిమా షూటింగ్ లు. ఇప్పటికిప్పుడు సినిమా షూటింగ్ లు మొదలు కాకపోతే మూడు చాలా సినిమాలు మూలన పడిపోతాయి. ఆర్ఆర్ఆర్  లాంటి సినిమాలు విడుదల డేట్ ను మీట్ కావడం కష్టం అవుతుంది. అందుకే సినిమాలు టీవీ షో లు, సీరియళ్ల షూటింగ్ లు అత్యవసరం ప్రారంభం కావాల్సి వుంది. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.

జూన్ ఫస్ట్ నుంచి కొన్ని పరిమితులతో షూటింగ్ లకు అనుమతి ఇచ్చే  విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం, మాస్క్ లు, గ్లవ్స్, థెర్మల్ గన్ లు, శానిటైజర్ ఛాంబర్లు వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ, షూటింగ్ లకు అనుమతి ఇచ్చే అవకాశం వుంది. 

అయితే నెలాఖరుకు కేసుల తీవ్రతలో ఏమైనా తేడా వస్తే, మాత్రం నిర్ణయాలు మారవచ్చు.  అలాగే స్టూడియోలకు కూడా పరిమిత సంఖ్యలో సిబ్బందిని అనుమతించడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం వంటి నిబంధనలు విధిస్తారని తెలుస్తోంది. 

థియేటర్లు ఇప్పుడే కాదు?

అయితే థియేటర్ల అనుమతి మాత్రం ఇప్పుడే వుండకపోవచ్చు అని తెలుస్తోంది. ఎందుకంటే థియేటర్లు ఓపెన్ చేయాలి అంటే అన్ని చోట్లా ఒకేసారి ఓపెన్ అయితేనే బెటర్. ఆంధ్ర, సీడెడ్ లేకుండా తెలంగాణ ఓపెన్ చేసి లాభం లేదు. అలాగే పక్క రాష్ట్రాలు, ఓవర్ సీస్ లో కూడా మన సినిమాలు విడుదల కావాల్సి వుంటుంది. అందువల్ల థయేటర్లు ఓపెన్ చేయడం మాత్రం మరో రెండు నెలలకు పైగా పడుతుందని అంచనా.

జగన్ కి స్పెషల్ థాంక్స్ చెప్పిన నవీన్ పట్నాయక్