కదులుతున్న దిల్ రాజు-శిరీష్ సామ్రాజ్యం?

ఏస్ దిల్ రాజు-శిరీష్ ల వ్యవహారాలపై ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో గుసగుసలు వున్నాయి. విమర్శలు వున్నాయి. కానీ ఎప్పుడూ ఎవ్వరూ గట్టిగా పెదవి విప్పరు. బాధపడుతూనే వాళ్లకు లొంగుతూ వస్తున్నారు.  Advertisement సంక్రాంతి, వేసవి,…

ఏస్ దిల్ రాజు-శిరీష్ ల వ్యవహారాలపై ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో గుసగుసలు వున్నాయి. విమర్శలు వున్నాయి. కానీ ఎప్పుడూ ఎవ్వరూ గట్టిగా పెదవి విప్పరు. బాధపడుతూనే వాళ్లకు లొంగుతూ వస్తున్నారు. 

సంక్రాంతి, వేసవి, దసరా సీజన్లలో ముందుగా థియేటర్లు అగ్రిమెంట్లు చేసేసుకుని, ఆపై సినిమాలను బేరం ఆడడం, మూడు సీజన్లకు కలిపి కనీసం మూడు రెళ్లు ఆరు కోట్లు విడుదలకు ముందే లాభం చేసుకోవడం అనే స్ట్రాటజీతో దిల్ రాజు-శిరీష్ వ్యవహరిస్తారని ఇండస్ట్రీలో ఇన్ సైడ్ టాక్ వుంది. 

తమకు అనుకూలమైన రేటుకు సినిమా ఇవ్వకుంటే థియేటర్లు అందకుండా చేయడం అన్నది స్ట్రాటజీ. లాస్ట్ ఇయర్ ఓ పెద్ద సినిమాకు వైజాగ్ లో రెండు కోట్లు అదనంగా రేటు వచ్చినా, తగ్గించి మరీ దిల్ రాజుకే ఇవ్వాల్సిన పరిస్థితి నిర్మాతకు వచ్చింది. 

ఈసారి క్రాక్ సినిమాను ఓ దశలో ఎటువంటి అడ్వాన్స్ ఇవ్వకుండా దిల్ రాజుకు ఇచ్చే పరిస్థితి వచ్చింది. కానీ చివరి నిమషంలో మరో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఆదుకున్నాడు.

ఇలాంటి నేపథ్యంలో క్రాక్ సినిమాను చాలా థియేటర్లలో లేపేసి, తమ సినిమాలు వేయడంపై దిల్ రాజు మీద నేరుగానే థ్వజమెత్తారు వరంగల్ శీను. ఇప్పుడు ఇది ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిపోయింది. 

ఇండస్ట్రీ జనాలు అంతా వరంగల్ శీను ప్రెస్ మీట్ ను ఇంటర్నల్ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు. సురేష్ బాబు లాంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్ కూడా ఇది చాలా దారుణం అని కామెంట్ చేసినట్లు బోగట్టా. ఆసియన్ సునీల్ కూడా ఈ పరిస్థితి మారాలని అన్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ పరిస్థితి వస్తుందని ముందుగానే తెలియడంతో ఓయు విద్యార్థి జెఎసి కూడా రంగంలోకి దిగి హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇకపై నైజాంలో దిల్ రాజు-శిరీష్ ల వ్యవహారాలకు అడ్డుకట్ట వేసేలా ఓ కాంక్రీట్ ప్లాన్ తయారు చేయాలని ఇండస్ట్రీ పెద్దలు పలువురు డిస్కషన్లు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 

శిరీష్ వ్యవహారాల గురించి మెగాస్టార్ చిరంజీవి కూడా అడిగి మరీ తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం థియేటర్ల వ్యవహారాల గురించి మాత్రమే కాకుండా, గతంలో పలు సినిమాలకు లెక్కలు చెప్పడంలో అవకతవకలు జరిగాయని వరంగల్ శ్రీను చెప్పడంతో ఆ వివరాలు అన్నీ తనకు పంపాలని మెగాస్టార్ కోరారన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

మొత్తం మీద వరంగల్ శ్రీను ఓ తేనెతుట్టను కదిపారు థియేటర్లు డిస్ట్రిబ్యూషన్, డిజిటల్ రైట్స్. ఆపై గిల్డ్ ఇలా అన్ని రంగాలను తన గుప్పిట్లో పెట్టుకుని, నిర్మాతలను కంట్రోలు చేస్తున్న దిల్ రాజు-శిరీష్ ల వ్యవహారాల గురించి పెదవి విప్పలేకపోతున్న అనేకానేక మంది నిర్మాతలు ఇప్పుడు ఈ విషయమే మాట్లాడుతూ, హడావుడి చేస్తున్నారు.

ఈ సంక్రాంతి అల్లుడు నేనే

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్