పంట‌ల పండ‌గ‌.. పుష్క‌ల‌మైన ఆనందం మ‌ధ్య‌న‌!

ప్ర‌కృతితో మ‌మేక‌మైన పండ‌గ‌.. ఒక ఇంటికి వ‌చ్చే పండ‌గ కాదు, ఒక కులానికి సంబంధించిన ఉత్సాహం కాదు, ఈ పండ‌గ అంద‌రిదీ, ఊరంతటికీ సంక్రాంతి!   Advertisement పంట మీద ఆధార‌ప‌డిన ప్ర‌తి ఒక్క‌రిదీ! మ‌నిషికే…

ప్ర‌కృతితో మ‌మేక‌మైన పండ‌గ‌.. ఒక ఇంటికి వ‌చ్చే పండ‌గ కాదు, ఒక కులానికి సంబంధించిన ఉత్సాహం కాదు, ఈ పండ‌గ అంద‌రిదీ, ఊరంతటికీ సంక్రాంతి!  

పంట మీద ఆధార‌ప‌డిన ప్ర‌తి ఒక్క‌రిదీ! మ‌నిషికే కాదు.. ప‌శువుకు, ప‌క్షికి కూడా సంక్రాంతి స‌మ‌యం ప్ర‌త్యేక‌మైన‌ది!

రుతుప‌వ‌న కాలంలో వ‌ర్షం స‌రిగ్గా కురిస్తే..  ఆ ఫ‌లితాలు సంక్రాంతికి ద‌క్కుతాయి! వ‌ర్షాలు స‌రిగ్గా కురిస్తే.. పంట పండుతుంది, పంట ప‌చ్చ‌గా ఉంటే.. ప్ర‌కృతి పుల‌కిస్తుంది. ప్ర‌కృతిలో భాగ‌మైన ప్ర‌తి జీవికీ సంక్రాంతి స‌మ‌యం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. 

పంట చేల‌ల్లోకి వెళ్లి చూస్తే.. ప‌క్షుల కిల‌కిలరావాలు రెట్టింపు ఉత్సాహంతో, వాటి సంతోష‌మంతా ధ్వ‌నిస్తూ వినిపిస్తాయి. ప‌క్షులు పెట్టిన గుడ్ల నుంచి పిల్ల‌లు బ‌య‌ట‌కు వ‌చ్చి.. రెట్టింపు సంద‌డి చేస్తూ ఉండే సీజ‌న్ ఇది!

అరుదైన ప‌క్షులు కూడా సంతానోత్ప‌త్తితో సంద‌డిగా ఉండే స‌మ‌యం ఇది. పంట చేలు ధాన్యాన్ని ఇచ్చే స‌మ‌యం ఇది. ఇలా ఉపఖండంలోనే సంక్రాంతి సంద‌ర్భం ప్ర‌కృతికి ప్ర‌త్యేక‌మైన‌ది.

ఇక తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. అంత‌టా పండ‌గ శోభ క‌నిపిస్తూ ఉంది. ప్ర‌త్యేకించి రైతుల ఇంట సంద‌డి నెల‌కొంది. మంచి వ‌ర్షపాతాలు న‌మోదు కావ‌డంతో.. ఖ‌రీఫ్ లో కొంత పంట న‌ష్టం జ‌రిగినా, రెండో పంట సాగు చేసుకునే చోట్ల‌, బోర్లు-బావుల- ప్రాజెక్టుల కింద పంట‌లు సాగు చేసుకునే వాళ్లకూ సంక్రాంతి స‌మ‌యానికి పంట‌లు చేతికి అందుతున్నాయి.

సంక్రాంతి అంటేనే పంట‌ల పండ‌గ‌, ఇలాంటి స‌మ‌యంలో పంట చేతికి అంద‌డానికి మించిన ఆనందం ఏముంటుంది? స‌ంక్రాంతి రైతుల పండ‌గ.. వారు ఈ సంద‌ర్భంలో ఆనందంగా ఉండ‌టానికి మించిన ఉత్సాహం ఏముంది?  సంక్రాంతి ప్ర‌కృతికి సంబంధించిన శుభ‌స‌మ‌యం, అలాంటి ప్ర‌కృతి ప‌చ్చ‌గా, కిల‌కిల‌రావాల మ‌ధ్య‌న‌ కొత్త అందాల‌ను సంత‌రించుకోవ‌డానికి మించిన అందం ఏముంది?

సంక్రాంతి అంటే హ‌రిదాసులు, సంక్రాంతి అంటే గంగిరెద్దులు, సంక్రాంతి అంటే స్వ‌చ్ఛ‌మైన సంబ‌రాలు, సంక్రాంతి అంటే పెద్ద పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మ‌లు..

ఇప్పుడు హ‌రిదాసులు చూద్దామ‌న్నా క‌న‌ప‌డ‌రు, గంగిరెద్దుల జాడ లేదు, గంగిరెద్దు ఆడించే వ్య‌క్తి ఊదే మేలం.. సంక్రాంతి సంబ‌రాల‌కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లా ఉండేది.. ప‌ల్లెల్లోకి వెళ్లినా ఇవేవీ లేవిప్పుడు.

స్వ‌చ్ఛ‌మైన సంబ‌రాలు క‌నిపించ‌వు.. క‌త్తి కట్టే కోడిపందేలు, ఖ‌రీదైన బ్రాండ్ల మ‌ద్యం.. రెండూ సంబ‌రాల‌ను క‌లుషితం చేసేవే. అవే అస‌లైన‌ సంబ‌రాలుగా పేరుపొందాయిప్పుడు. స్వ‌చ్ఛ‌మైన సంబ‌రాలు వేరే.. వాటిని దాదాపు మ‌రిచిపోయారంతా. అపార్ట్మెంట్ క‌ల్చ‌ర్ లోనూ ఆర్టిపిషియ‌ల్ సంబ‌రాలే.

మ‌నుషుల సంగ‌తెలా ఉన్నా.. పంట‌లు, ప్ర‌కృతి మాత్రం సహ‌జంగా స్పందించాయి. ఈ ఏడాది సంక్రాంతిని అందంగా మ‌లిచాయి. అంద‌రికీ త‌మ అందంతో సంక్రాంతి శుభాకాంక్ష‌ల‌ను తెలుపుతున్నాయ‌వి.

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్

ఈ సంక్రాంతి అల్లుడు నేనే