తమన్న టు కాజల్ వయా శృతిహాసన్

చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ప్రకటించిన వెంటనే తమన్న పేరు వినిపించింది. చిరంజీవితో నటించాలని ఉందంటూ అప్పుడెప్పుడో మిల్కీబ్యూటీ ప్రకటించడం, ఆ తర్వాత చిరంజీవి కూడా తమన్నాను అక్కున చేర్చుకోవడంతో ఈ…

చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ప్రకటించిన వెంటనే తమన్న పేరు వినిపించింది. చిరంజీవితో నటించాలని ఉందంటూ అప్పుడెప్పుడో మిల్కీబ్యూటీ ప్రకటించడం, ఆ తర్వాత చిరంజీవి కూడా తమన్నాను అక్కున చేర్చుకోవడంతో ఈ కాంబినేషన్ ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆ తర్వాత తమన్న పేరు వినిపించడం తగ్గింది.

ఆమె స్థానంలో శృతిహాసన్ పేరు తెరపైకి వచ్చింది. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమాలో శృతిహాసన్ నటించింది. పైగా ఈమధ్య తెలుగుతెరపై ఆమెకు కాస్త గ్యాప్ వచ్చింది. కాబట్టి కొరటాల రిఫరెన్స్ తో చిరంజీవి సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందంటూ శృతిపై కొన్ని పుకార్లు షికార్లు చేశాయి.

కొన్నాళ్లపాటు ఈ గాసిప్స్ బాగానే నడిచాయి. లేటెస్ట్ గా ఇప్పుడు శృతిహాసన్ పేరు కూడా మాయమైంది. ఆమె స్థానంలో ఫ్రెష్ గా కాజల్ అగర్వాల్ పేరు వినిపిస్తోంది. అవును.. చిరంజీవి-కొరటాల సినిమాలో కాజల్ నే తీసుకుంటారట. ఆల్రెడీ చిరంజీవి సరసన నటించిన అనుభవం ఉండడంతో పాటు చరణ్ కు చాలా క్లోజ్ కాబట్టి కాజల్ నే తీసుకుంటారనేది తాజా సమాచారం.

అయితే ఇప్పటివరకు వచ్చిన ఈ కబుర్లన్నీ గాసిప్సే. ఓ ప్రాజెక్టును అలా లైమ్ లైట్లో ఉంచేందుకు మెగా కాంపౌండ్ ఇలా లీకులు ఇస్తూ ఉంటుంది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ చేసే టైమ్ కూడా అటు చిరంజీవి, ఇటు చరణ్ కు లేదు. సైరా రిలీజ్ అయ్యేంతవరకు ఈ ఫీలర్లు ఇలా వస్తుంటాయంతే.

కామ్రేడ్ కథ మొత్తం చెప్పిన విజయ్ దేవరకొండ

తల్లిపేరుతో సంజయ్ చేస్తే.. తండ్రి పేరుతో లోకేష్ చేశాడు