చెర్రీకి నో చెప్పిన కాజ‌ల్‌

క‌థ‌లు న‌చ్చడం లేదో, హీరోలు న‌చ్చడం లేదో, లేదంటే పారితోషికం న‌చ్చడం లేదో తెలీదుగానీ, త‌న ద‌గ్గర‌కు వ‌చ్చిన ప్రతీ సినిమానీ వ‌ద్దనుకొంటోంది కాజ‌ల్‌. గ‌బ్బర్ సింగ్ 2 ఆఫ‌ర్‌ని వ‌దులుకొన్న కాజ‌ల్ మ‌రో…

క‌థ‌లు న‌చ్చడం లేదో, హీరోలు న‌చ్చడం లేదో, లేదంటే పారితోషికం న‌చ్చడం లేదో తెలీదుగానీ, త‌న ద‌గ్గర‌కు వ‌చ్చిన ప్రతీ సినిమానీ వ‌ద్దనుకొంటోంది కాజ‌ల్‌. గ‌బ్బర్ సింగ్ 2 ఆఫ‌ర్‌ని వ‌దులుకొన్న కాజ‌ల్ మ‌రో మెగా హీరోకి నో చెప్పి షాక్‌కి గురి చేసింది. 

ఆ హీరో ఎవ‌రో కాదు, రామ్‌చ‌ర‌ణ్. కృష్ణవంశీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో క‌థానాయిక‌ల వేట జ‌రుగుతోంది. రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న కాజ‌ల్ అయితే బాగుంటుంద‌ని చిత్రబృందం భావించింది. ఈమేర‌కు కాజ‌ల్‌ని సంప్రదిస్తే.. నో చెప్పేసింద‌ట‌. పారితోషికం ఎంత ఆఫ‌ర్ చేసినా, చేయ‌నుగాక చేయ‌ను అనేసింద‌ట‌. దాంతో – చిత్రబృందం ఖంగు తిన్నది.

 చంద‌మామ‌తో కాజ‌ల్‌కి స్టార్‌డ‌మ్ తెచ్చింది కృష్ణవంశీనే. అలాంటిది ఆయ‌న సినిమా నో ఎందుకు చెప్పిందో మ‌రి.?  కాజ‌ల్ త‌ప్పుకోవ‌డంతో చ‌ర‌ణ్ కోసం క‌థానాయిక వేట కొన‌సాగుతోంది.