రెండోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ పదవీ ప్రమాణ స్వీకారం సందర్బంగా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్ళడం, వారిలో చాలామంది ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగిపోయాయి. అయితే, హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కి మాత్రం ఆహ్వానం కాస్త లేటుగా అందిందట. 'లేటుగా ఆహ్వానం అందింది.. ఆ కారణంగా నేను ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను…' అంటూ కాజల్, తనకు అందిన ఆహ్వానాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాపోయింది.
సినీ ప్రముఖుల్లో కాజల్‌కి మాత్రమే ఈ ఆహ్వానం అందిందా.? లేదంటే, కాజల్ మాత్రమే తనకు ఆహ్వానం అందిందనే విషయాన్ని పబ్లిసిటీ చేసుకుంటోందా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. కాజల్ అభిమానులు మాత్రం, తమ అభిమాన హీరోయిన్‌కి అందిన ఆహ్వానం పట్ల ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కాజల్ త్వరలోనే రాజకీయాల్లోకి రావాలని కూడా ఆకాంక్షించేస్తున్నారు. కొందరు బీజేపీ మద్దతుదారులైతే కాజల్, బీజేపీలో చేరాలని ఆహ్వానించేస్తున్నారు కూడా.
థర్టీ ప్లస్‌లోకి వచ్చేసినా కాజల్ ఇంకా హీరోయిన్‌గా టాప్ లీగ్‌లోనే కొనసాగుతోంది. అవకాశాలు బాగానే వున్నాయామెకి. దీపం వున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి కాబట్టి, ఇంకొన్నాళ్ళు సినీ పరిశ్రమలో ఇలానే కొనసాగుతుందా.? లేదంటే, టైమ్ సెట్ చేసుకుని రేపో మాపో రాజకీయ ప్రకటన చేస్తుందా.? ఏమోగానీ, రాజకీయ ఆలోచనలతోనే కాజల్ ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందంటూ హేటర్స్ అప్పుడే రచ్చ షురూ చేసేశారు.
ఈసారి జాతీయ స్థాయిలో పొలిటికల్ సినీ గ్లామర్ గట్టిగానే కన్పించింది. అన్ని రాజకీయ పార్టీల్లోనూ సినీ ప్రముఖులు హల్ చల్ చేశారు. కొందరు చట్ట సభలకు ఎంపికయ్యారు కూడా.!