పాపం బాబు : బతుకు మళ్లీ చెట్టు కిందికేనా?

ఇప్పుడు చంద్రబాబునాయుడు పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. నవ్యాంధ్ర రాజధానిలో కనీసం సొంత ఇల్లు కూడా లేని ఉద్ధండ రాజకీయ నాయకుడిగా ఆయన మిగిలిపోయారు. అధికారం కోల్పోయి… విషమ పరిస్థితిలో ఉన్న ఆయన……

ఇప్పుడు చంద్రబాబునాయుడు పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. నవ్యాంధ్ర రాజధానిలో కనీసం సొంత ఇల్లు కూడా లేని ఉద్ధండ రాజకీయ నాయకుడిగా ఆయన మిగిలిపోయారు. అధికారం కోల్పోయి… విషమ పరిస్థితిలో ఉన్న ఆయన… ఉన్న నీడ కూడా పోగొట్టుకుంటే ఎలాగ? ఓటుకు నోటు కేసుకు జడిసి.. పలాయనం చిత్తగించిన తొలిరోజుల్లో చెట్టుకింద బస్సులో విశ్రమించి పాలన సాగించినట్లుగానే… ఇప్పుడు కూడా… చెట్టుకింద జీవిస్తూ ప్రతిపక్షపాత్ర పోషిస్తారా? లేదా, ఓ సొంత/అద్దె గూడు ఏర్పాటు చేసుకుంటారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా పూర్తిగా మారిపోయాయి. సందట్లో సడేమియా ఏంటంటే… నాయకుల నివాసాల సంగతేమిటి? అన్నది! అమరావతిలో రాజధాని ఏర్పాటు అయిన తరువాత… తనకంటూ అక్కడ ఓ సొంత ఇల్లు లేకపోయినా, ఏర్పాటు చేసుకోకపోయినా.. తానే ప్రభుత్వాధినేత గనుక.. ప్రభుత్వ పరంగా ఓ ఇంటిని తన అధికార నివాసంగా మార్చుకుని చంద్రబాబు ఈ అయిదేళ్లూ గడిపేశారు.

వైఎస్ జగన్ హైదరాబాదులో నివాసం ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నాడంటూ పదేపదే విమర్శలు కూడా గుప్పించారు. ఈలోగా వైఎస్ జగన్ తాడేపల్లిలో తనకంటూ ఓ సొంత ఇల్లు నిర్మించుకోవడం, అందులో నివసించడం కూడా ప్రారంభం అయింది. చివరికి ఏపీ రాజకీయాల్లో ఎన్నికల తర్వాత.. తన పాత్ర ఎంత లెంగ్త్ ఉంటుందో తెలియకపోయినా… ఆటలో అరటిపండులా రంగప్రవేశం చేసిన పవన్ కల్యాణ్ కూడా… విజయవాడలో సొంత ఇళ్లు నిర్మించుకున్నారు.

ఈ నేతలు ఇలా ఇళ్లు ఏర్పాటు చేసుకున్నా కూడా చంద్రబాబు ఆ జోలికి వెళ్లలేదు. ఏపీకి ఎప్పటికీ తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, అదే అధికార నివాసంలో ఆజన్మాంతమూ గడుపుతానని చంద్రబాబు భ్రమలో ఉన్నారో, లేదా, ఏపీ రాజకీయాల్లో తనకిక భవిష్యత్తు ఉండదు గనుక సొంత ఇల్లు దండగనే క్లారిటీతో ఉన్నారో తెలియదు గానీ.. చంద్రబాబు మాత్రం సొంత ఇల్లు కట్టుకోలేదు.

ఇప్పుడు పదవి ఊడిపోయింది. మాజీ అయ్యారు. రేపో మాపో జగన్ సర్కారు నుంచి తాకీదు వస్తే ఇప్పుడున్న అధికార నివాసం ఖాళీ చేయాల్సిందే. మరి సొంత ఇల్లు లేని చంద్రబాబు, అద్దెకొంపకు మారుతారా? లేదా, రాజధాని తరలింపు పేరిట ఉన్నపళంగా హైదరాబాదునుంచి పారిపోయిన తొలినాళ్ల మాదిరిగా చెట్టు కింద నుంచే ఈ అయిదేళ్లూ గడిపేస్తారా? అనే చర్చ ప్రజల్లో సాగుతోంది.

ఉత్తరాంధ్రలో వైసీపీని అక్కున చేర్చుకోవడానికి కారణమేంటి?