పచ్చ కోటరీ గుండెల్లో రైళ్లు!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం స్వీకరించడంతో పచ్చకోటరీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. అయిదేళ్లుగా విచ్చలవిడిగా సాగించిన అరాచకాలకు ఏవిధంగా చెక్ పెడుతుందోననే భయం మాత్రమే కాకుండా… తాము దోషులుగా…

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం స్వీకరించడంతో పచ్చకోటరీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. అయిదేళ్లుగా విచ్చలవిడిగా సాగించిన అరాచకాలకు ఏవిధంగా చెక్ పెడుతుందోననే భయం మాత్రమే కాకుండా… తాము దోషులుగా నిలబడాల్సి వస్తుందనే భయం కూడా వారిని వెన్నాడుతోంది. కాంట్రాక్టుల ముసుగులో ఎడాపెడా దోచుకున్న వారు.. అడ్డగోలుగా ప్రభుత్వ సొమ్మును పంచుకున్నవారు అందరూ ఇప్పుడు గుబులు పడుతున్నారు.

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సరికొత్త రాష్ట్రంగా అవతరించిన నాటినుంచి పచ్చ కోటరీకి కొమ్ములు పొడుచుకువచ్చాయి. అందినంత మేరా దోచుకోవడానికి అనేకానేక ప్రణాళికలు రచించారు. పనుల పురోగమనం పరిమితంగానే ఉన్నప్పటికీ.. ఎడాపెడా టెండర్లు కేటాయింపుల వ్యవహారాలు మాత్రం చోటు చేసుకున్నాయి. తాము దోచుకోవడానికి అనుకూలంగా వ్యవహరించే కంపెనీలను మాత్రం ఎంచుకుని… వారికి మాత్రమే ఉన్న అర్హతలనే నిబంధనలుగా రూపొందిస్తూ టెండర్లను పిలిచి.. యథేచ్ఛగా వ్యవహరించారు.

వందల వేల కోట్ల పనులన్నీ అడ్డగోలుగా కేటాయింపులు జరిగాయి. అయితే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే.. ఇలాంటి పచ్చ అక్రమార్కులందరికీ గుబులు మొదలైంది. దానికితోడు అవినీతి రహిత పరిపాలన అందిస్తానని అధికారం చేపట్టిన తొలినాడే ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి… టెండర్లలో అక్రమాలను కూడా సమీక్షించబోతున్నట్లుగా ప్రకటించారు. టైలర్ మేడ్ ప్రీ క్వాలిఫికేషన్ తరహాలో.. అయినవారికి కట్టబెట్టేందుకు నిబంధనలను మార్చి చేసిన అక్రమాలు అన్నింటికీ చెక్ పెడతాం అన్నారు. ఇది చాలామందికి మింగుడుపడడం లేదు.

గత ప్రభుత్వపు హయాంలో అడ్డదారిలో పనులు దొరకబుచ్చుకోవడానికి.. నాయకులకు భారీగా ముడుపులు సమర్పించుకుని పనులు తీసుకున్నారు. ఇప్పుడు జగన్ ప్రకటించినట్లుగా.. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మొదలైతే గనుక.. తమ టెండర్లకు చెక్ పడుతుంది. భారీగా నష్టపోవాల్సి వస్తుంది. పనులు పోతేపోయే… పచ్చ నాయకులకు సమర్పించుకున్న భారీ ముడుపుల్లోంచి పైసా కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. ఈ రకంగా తాము అన్నిరకాలుగా మునిగిపోతామనే భయం వారిని వెన్నాడుతోంది. ఒకసారి అక్రమాలు చేసినందుకు శాస్తి తప్పదనే భయంలో ప్రత్యామ్నయాలు వెతుక్కుంటున్నారు.

ఉత్తరాంధ్రలో వైసీపీని అక్కున చేర్చుకోవడానికి కారణమేంటి?