బాబు బిగ్ యూటర్న్.. ఈసారి కష్టమే!

ఇష్టమొచ్చినట్టు యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబును ఎవరూ అధిగమించలేరు. ఆయన యూటర్న్ లకు బ్రాండ్ అంబాసిడర్. అందుకే సోషల్ మీడియాలో అతడ్ని అంతా ముద్దుగా “యూటర్న్-అంకుల్” అని పిలుచుకుంటారు. అలాంటి ఘనత సాధించిన బాబు ఇప్పుడు…

ఇష్టమొచ్చినట్టు యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబును ఎవరూ అధిగమించలేరు. ఆయన యూటర్న్ లకు బ్రాండ్ అంబాసిడర్. అందుకే సోషల్ మీడియాలో అతడ్ని అంతా ముద్దుగా “యూటర్న్-అంకుల్” అని పిలుచుకుంటారు. అలాంటి ఘనత సాధించిన బాబు ఇప్పుడు మరో పెద్ద యూటర్న్ కు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది.

మొన్నటివరకు బీజేపీని, నరేంద్రమోడీని తిట్టిపోసిన చంద్రబాబు.. ఇప్పుడు హఠాత్తుగా యూటర్న్ తీసుకొని తిరిగి బీజేపీతో కలిసిపోవాలని చూస్తున్నారట. నమ్మశక్యంగా అనిపించకపోయినా, చెప్పుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఇది నిజం అంటున్నారు విశ్లేషకులు. అన్నీ అనుకున్నట్టు జరిగితే నిస్సిగ్గుగా బీజేపీతో చేతులు కలపడానికి బాబు సిద్ధమౌతున్నారట.

ఈ మేరకు వెంకయ్యనాయును చంద్రబాబు రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. గతంలో బీజేపీ-టీడీపీ పొత్తులో కీలకపాత్ర పోషించారు వెంకయ్య. కానీ ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత రెండుపార్టీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు ఏకపక్షంగా ఎన్డీఏ నుంచి వైదొలిగి, బీజేపీపై తిట్ల దండకం అందుకున్నారు. ఈ వ్యూహం తనను గెలిపిస్తుందని భావించారు. కానీ జనాలు బాబును చిత్తుగా ఓడించారు.

దీంతో రాజకీయంగా ఏకాకి అయిన బాబు, మరోసారి వెంకయ్యను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. కేశినేని నానితో రాయబారం పంపించి, బీజేపీతో సంప్రదింపులు జరపమని వెంకయ్యను కోరారట. అవినీతి చేసిన ఎవ్వర్నీ వదిలిపెట్టమని ప్రమాణ స్వీకారం చేసిన రోజే జగన్ ప్రకటించారు. తీగలాగితే డొంక కదిలినట్టు.. ఒక్కొక్క వ్యవహారం బయటకొచ్చేకొద్దీ తను బుక్ అవ్వడం ఖాయమనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. ఇలాంటి టైమ్ లో కేంద్రంతో కలిసిపోవడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నారు. అందుకే ఈ అతిపెద్ద యూటర్న్.

బాబు సైడ్ నుంచి ఈ లెక్కలన్నీ బాగానే ఉన్నాయి కానీ, బీజేపీ మాత్రం ఈసారి చంద్రబాబును పట్టించుకునే స్థితిలో లేదు. తమతో తెగతెంపులు చేసుకున్నా ఫర్వాలేదు, ఎన్నికల వేళ తమను తిట్టినా ఫర్వాలేదు, కానీ నేరుగా వెళ్లి కాంగ్రెస్ తో కలవడాన్ని కమలనాధులు జీర్ణించుకోలేకపోతున్నారు. వెన్నుపోటు బాబును మరోసారి నమ్మకూడదని ఆ పార్టీ గట్టిగా నిర్ణయించుకుంది.

పైగా ఈసారి ఆంధ్రప్రదేశ్ పై గురిపెట్టింది ఆ పార్టీ. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని, వచ్చే ఎన్నికల నాటికి కనీసం 2 ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాలు నెగ్గాలని టార్గెట్ గా పెట్టుకుంది. రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న చంద్రబాబుతో చేతులు కలిపితే అది తమ భవిష్యత్తుకు ప్రమాదకరమనే విషయం బీజేపీకి తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో వెంకయ్యనాయుడు మంత్రాంగం ఫలిస్తుందా? బాబు యూటర్న్ సక్సెస్ అవుతాందా? వెయిట్ అండ్ సీ!

ఉత్తరాంధ్రలో వైసీపీని అక్కున చేర్చుకోవడానికి కారణమేంటి?