సల్మాన్ ఖాన్ ఈమధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్ సినిమా నుంచి తప్పుకున్న ప్రియాంక చోప్రాను ఉద్దేశించి మాట్లాడుతూ.. “నా సినిమా కోసం చాలామంది ఆడవాళ్లు మొగుళ్లను వదిలేసి వస్తారు” అంటూ నోరుజారాడు. దీనిపై దేశవ్యాప్తంగా పెనుదుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో అదే సినిమాలో నటించిన దిశా పటానీ, ఇకపై సల్మాన్ తో కలిసి సినిమాలు చేయనని ప్రకటించింది.
సల్మాన్ ఇచ్చిన కాంట్రవర్సీ స్టేట్ మెంట్ కు వ్యతిరేకంగా దిశాపటానీ ఇలా స్పందించి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ దిశా మాత్రం ఈ విషయంలో సల్మాన్ కు మద్దతిస్తూనే, మరో విషయంపై ఇలా స్పందించింది. సల్మాన్ కు తనకు బాగా ఏజ్ గ్యాప్ ఉందని, అందుకే ఇకపై అతడి సినిమాల్లో నటించనంటోంది ఈ భామ.
ఆ మాటకొస్తే సల్మాన్ సరసన నటించిన హీరోయిన్లంతా అతడి వయసులో సగం కంటే తక్కువ వయసున్న వాళ్లే. వాళ్లెవరికీ లేని అభ్యంతరం దిశా పటానీకే ఎందుకొచ్చిందో అర్థంకావడం లేదు? దిశా మాత్రం తను సల్మాన్ పక్కపక్కన నిల్చుంటే వయసు రీత్యా చాలా తేడాగా కనిపిస్తోందని, అందుకే ఇకపై సల్మాన్ సినిమాల్లో కనిపించనని ప్రకటించింది.
నిజానికి ఇది సరైన సాకు కాదు. సల్మాన్ సినిమాల్లో ఇకపై నటించనంటూ దిశా ప్రకటించడం వెనక ఏదో బలమైన కారణం ఉంది. దాన్ని బయటకు చెప్పడం ఇష్టంలేక ఇలా వయసు తేడాను చూపిస్తోంది దిశా. ఈ విషయంలో ఆమె బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ ప్రమేయం ఉన్నట్టు కనిపిస్తోంది.
బాలీవుడ్ లో ఏదీ ఎక్కువ రోజులు దాగదు. ఈ మేటర్ కూడా త్వరలోనే బయటకొస్తుంది. అప్పటివరకు వెయిట్ చేయాలంతే.