కాజల్ కెరీర్ లోనే అతిపెద్ద బూతు సినిమా

హిందీలో సూపర్ హిట్ అయింది క్వీన్ సినిమా. కంగనా రనౌత్ నటించిన ఈ సినిమా సౌత్ రీమేక్ హక్కుల్ని మనుకుమరన్ దక్కించుకున్నారు. ఒకేసారి సౌత్ లోని నాలుగు భాషల్లో తెరకెక్కించారు. ఒకేసారి దక్షిణాది మొత్తం…

హిందీలో సూపర్ హిట్ అయింది క్వీన్ సినిమా. కంగనా రనౌత్ నటించిన ఈ సినిమా సౌత్ రీమేక్ హక్కుల్ని మనుకుమరన్ దక్కించుకున్నారు. ఒకేసారి సౌత్ లోని నాలుగు భాషల్లో తెరకెక్కించారు. ఒకేసారి దక్షిణాది మొత్తం విడుదల చేయాలనేది ప్లాన్. అంతా బాగానే ఉంది కానీ తమిళ వెర్షన్ కు వచ్చేసరికి మాత్రం క్వీన్ రీమేక్ కు చిక్కులు తప్పడంలేదు.

క్వీన్ తమిళ రీమేక్ లో కాజల్ మెయిన్ లీడ్ పోషించింది. రమేష్ అరవింద్ దర్శకుడు. ఈ సినిమా ఇప్పుడు సెన్సార్ ఇబ్బందుల్లో పడింది. తాజాగా సినిమా చూసిన సెన్సార్ అధికారులు సినిమాకు ఎ-సర్టిఫికేట్ ఇచ్చారు. అంతేకాదు, ఓ పాతిక వరకు ఆడియో, వీడియో కట్స్ సూచించారు. దీంతో యూనిట్ షాక్ అయింది.

నిజానికి ఈ సినిమా టీజర్ వచ్చినప్పుడే చాలామంది అడల్ట్ కంటెంట్ ఉంటుందని ఊహించారు. మిగిలిన 3 భాషల్లో వచ్చిన టీజర్లు బాగానే ఉన్నప్పటికీ, తమిళ్ లో వచ్చిన టీజర్ మాత్రం కాస్త హెవీ డోస్ లో ఉంది. ఆ టీజర్ లో కాజల్ వక్షభాగాన్ని మరోనటి టచ్ చేయడం పెద్ద సంచలనంగా మారింది. సినిమాలో అలాంటి సన్నివేశాలు, బూతు డైలాగులు చాలానే ఉన్నాయనే విషయం సెన్సార్ నిర్ణయంతో మరోసారి నిర్థారణ అయింది.

మిగతా భాషల్లో కూడా అలా బోల్డ్ గా తీసే వెసులుబాటు ఉన్నప్పటికీ హీరోయిన్లు అభ్యంతరం చెప్పడంతో క్లీన్ గానే తెరకెక్కాయి. తెలుగులో తమన్న నటించిన దటీజ్ మహాలక్ష్మీ టీజర్ మామూలుగానే ఉంది. అటు కన్నడలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ చేసిన వెర్షన్లపై కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఒక్క తమిళ్ లో మాత్రం కాజల్ నటించిన పారిస్-పారిస్ మూవీ హాట్ గా తెరకెక్కింది. ఇలాంటి సీన్లలో నటించడానికి కాజల్ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడమే దీనికి కారణం.

ప్రస్తుతానికి మేకర్స్, సెన్సార్ వ్యవహారశైలిపై సీరియస్ గా ఉన్నారు. రివ్యూ కమిటీని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు. మొత్తమ్మీద మిగతా 3 భాషల్ని పక్కనపెడితే, కాజల్ నటించిన తమిళ వెర్షన్ మాత్రం హాట్ గా ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

అధికారంతో వైఎస్సార్సీపీ, ఆరాటంతో బీజేపీ