Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కళ్యాణ్‌ బాబాయ్‌ జపం దేనికి?

కళ్యాణ్‌ బాబాయ్‌ జపం దేనికి?

సోదరుడు హరికృష్ణ కుటుంబంతో బాలకృష్ణ అంటీ ముట్టనట్టు ఉంటోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ సినిమాల వేడుకలకి గానీ, కళ్యాణ్‌రామ్‌ చిత్రాల ఫంక్షన్లకి గానీ బాలకృష్ణ రావడం లేదు. బాలకృష్ణ ఈ ఇద్దరితో దూరం పాటిస్తున్నా కానీ ఈమధ్య ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ బాగా క్లోజ్‌ అయ్యారు. 

అయినప్పటికీ కళ్యాణ్‌రామ్‌ మాత్రం బాబాయ్‌ నామ జపం మానలేదు. తన కొత్త సినిమాలో బాలకృష్ణ రిఫరెన్సులని కళ్యాణ్‌రామ్‌ బాగానే వాడుకున్నాడు. తన తాతయ్య లేదా సోదరుడి రిఫరెన్సులని కాకుండా బాబాయ్‌ని హైలైట్‌ చేయడానికే కళ్యాణ్‌ ఆసక్తి చూపించాడు. 

నందమూరి అభిమానుల్లో ఒక వర్గం ఎన్టీఆర్‌కి యాంటీ అయింది. ఆ వర్గాన్ని కూడా ఆకట్టుకోవడానికి కళ్యాణ్‌రామ్‌ ట్రై చేస్తున్నాడా? ఎన్టీఆర్‌ లాంటి స్టార్‌నే పట్టించుకోవడం మానేసిన వర్గం ‘పటాస్‌’ని కేర్‌ చేస్తుందా? ఫైనల్‌ రిజల్ట్‌ మాట ఎలా ఉన్నా కానీ పటాస్‌ సినిమాపై ప్రీ రిలీజ్‌ బజ్‌ అయితే బాగుంది. అందుకే కళ్యాణ్‌రామ్‌ ట్రాక్‌ రికార్డ్‌తో పని లేకుండా బిజినెస్‌ భేషుగ్గా జరిగింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?