Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్‌ టైటిల్‌ ఇటు మారింది

మహేష్‌ టైటిల్‌ ఇటు మారింది

మహేష్‌బాబుతో క్రిష్‌ తీద్దామని అనుకున్న సినిమాకి శివమ్‌ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసారు. క్రిష్‌తో శివమ్‌ చేస్తున్నట్టు మహేష్‌ కూడా అప్పట్లో చెప్పాడు కానీ ఆ సినిమా మెటీరియలైజ్‌ అవలేదు. అయితే ఆ టైటిల్‌ ఇంతకాలం క్రిష్‌ దగ్గరే ఉంది. ఆ టైటిల్‌పై ఆసక్తి సన్నగిల్లిందో ఏమో... రెన్యువల్‌ చేయించినట్టు లేడు. 

దాంతో ఆ టైటిల్‌ ఇప్పుడు చేతులు మారింది. రామ్‌ హీరోగా శ్రీనివాస్‌రెడ్డి అనే కొత్త దర్శకుడు తీయబోతున్న చిత్రానికి శివమ్‌ అనే టైటిల్‌ ఖరారైంది. విఐపి రీమేక్‌ చేయాలా లేక ఈ సినిమా చేయాలా అని ఆలోచించుకున్న రామ్‌ చివరకు ఈ చిత్రానికే మొగ్గు చూపాడు. దాంతో విఐపి తెలుగులోకి రఘువరన్‌ బీటెక్‌ పేరుతో అనువాదమైంది. 

నిజానికి శ్రీనివాస్‌రెడ్డి ఈ చిత్రాన్ని నితిన్‌ హీరోగా తీద్దామని అనుకున్నాడు. ఆ చిత్రం ఓపెనింగ్‌ కూడా అయిన తర్వాత ఆగిపోయింది. నితిన్‌ తప్పుకోవడంతో ఆ కథ రామ్‌కి వెళ్లింది. నితిన్‌ ఏం మిస్‌ అయ్యాడో, రామ్‌ శివమ్‌గా ఏం సాధించబోతున్నాడో చూడాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?