టెంపర్ బిజినెస్ ఇంకా ప్రారంభం కాలేదు

టెంపర్ హైప్ ఇంకా ఊపందుకోలేదో లేక ఎన్టీఆర్ మార్కెట్ అలా వుందో తెలియదు కానీ, ఇంతవరకు ఓవర్ సీస్ మినహా మరే ఏరియా ఇంకా బిజినెస్ కాలేదు. టెంపర్ బిజినెస్ కు సంబంధించి ఇంకా…

టెంపర్ హైప్ ఇంకా ఊపందుకోలేదో లేక ఎన్టీఆర్ మార్కెట్ అలా వుందో తెలియదు కానీ, ఇంతవరకు ఓవర్ సీస్ మినహా మరే ఏరియా ఇంకా బిజినెస్ కాలేదు. టెంపర్ బిజినెస్ కు సంబంధించి ఇంకా ఎంక్వయిరీలే తప్ప, కౌంటర్ కు బోణీ కాలేదని వినికిడి. పూరికి పెద్ద మార్కెట్ లేదు. అంతా ఎసి. డిసి వ్యవహారం. 

ఎన్టీఆర్ మార్కెట్ బాగాదెబ్బతిని వుంది. ఇలాంటి టైమ్ లో బండ్ల గణేష్ వీళ్ల కాంబినేషన్ సెట్ చేసుకున్నాడు. ఇదిలా వుంటే విడుదల తేదీ అంత గొప్పగా లేదు. పండుగ ముందు అయితే జనం ఓకె అనేవారేమో? కానీ పరిక్షలు, క్రికెట్ ఇలాంటి టైమ్ లో వదులుతున్నారు.  

మరో పక్క షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. 24, 25 నాటికి పూర్తవుతుంది అంటున్నారు. మొదటి టీజర్ అంతగా ఆకట్టుకోలేదు. మరో టీజర్ విడుదల చేసే మూడ్ లో పూరి-ఎన్టీఆర్ లేరు. వాళ్లతో సమస్య ఇది అని బండ్ల గణేష్ చెప్పలేరు.  మరి టెంపర్ కు ఊపు ఎలావస్తుందో? ఎప్పుడు మార్కెట్ అవుతుందో మరి.