పదేళ్ల పాటు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఇండస్ట్రీలో వుండిపోయాడు డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ. అలాంటి వ్యక్తికి నాగార్జున బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ఇచ్చాడు. మూడో సినిమా కూడా అదే అన్నపూర్ణ బ్యానర్ లో వుంటుంది అనుకుంటే, రవితేజతో సినిమా అంటూ ప్రకటించేసారు. దీనిపై చాలా గుసగుసలు వినిపించడం ప్రారంభమయ్యింది. సురేష్ బాబు అడ్డం పడతున్నారని, నాగార్జున ఒప్పుకోలేదని ఇలా రకరకాల వార్తలు.
అయితే ఇప్పుడు మొత్తం రూట్ క్లియర్ అయిపోయిందని, కళ్యాణ్ కృష్ణ తన నాలుగో సినిమాను నాగార్జునకు చేయడానికి అంగీకరించి, అగ్రిమెంట్ చేసి బయటకు వచ్చాడని తెలుస్తోంది.
కళ్యాణ్ కృష్ణ నాగార్జునకు ఓ సినిమా చేయాల్సి వుంది. ఈలోగా సురేష్ బాబు దగ్గరకు వెళ్లి కథ చెప్పాడు. వెంకీ-నాగ్ చైతన్య కాంబినేషన్ లో. కానీ ఇలా కథ చెబుతున్నట్లు, అందులో నాగ చైతన్య వుంటాడన్నది నాగార్జునకు చెప్పనే లేదని వినికిడి. చైతన్య హీరొ కాబట్టి ఓకె అయిపోతుందని కళ్యాణ్ కృష్ణ ధీమా పడినట్లు తెలుస్తోంది.
ఇదే నాగార్జునకు కాస్త ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. అయినా సైలెంట్ గా వుండిపోయాడట. తీరా రవితేజతో తమకు చెప్పకుండా సినిమా అనౌన్స్ చేసేసరికి నాగ్ అడ్డం పడినట్లు తెలుస్తోంది. ఆఖరికి కళ్యాణ్ కృష్ణ వెళ్లి, మరేం డిస్కషన్లు చేసారో కానీ, చివరకి నాలుగో సినిమా చేయడానికి అగ్రిమెంట్ రాసి, బయటకు వచ్చాడట.
ఇంక మరే సమస్య లేకపోతే, రవితేజతో కళ్యాణ్ కృష్ణ నేలటికెట్ సినిమా స్టార్ట్ అవుతుంది.