Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగార్జున సరసన కన్నడ బ్యూటీ

నాగార్జున సరసన కన్నడ బ్యూటీ

ఈ నెలలోనే నాగార్జున, నాని హీరోలుగా మల్టీస్టారర్ మూవీ ప్రారంభం కాబోతోంది. తాజాగా ఈ మూవీలో ఓ హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. సినిమాలో నాగార్జున సరసన కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాధ్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నారట. మూవీ లాంఛింగ్ రోజున ఈ మేటర్ ను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు.

కన్నడలో యూ-టర్న్ అనే హిట్ మూవీలో నటించింది శ్రద్ధా శ్రీనాధ్. ఈమధ్య తమిళనాట హిట్ అయిన విక్రమ్ వేద అనే సినిమాలో కూడా నటించింది. స్టోరీ ప్రకారం ఈ అమ్మాయి అయితే బాగుంటుందని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఫిక్స్ అయ్యాడట. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో నాగ్, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య సన్నివేశాలు వస్తాయట.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మాతగా ఈసినిమా రాబోతోంది. 'అ!' సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే నాని ఫ్రీ అయిపోతాడు. వర్మ సినిమా చేస్తున్నప్పటికీ నాగార్జున కూడా ఈ సినిమాకు కాల్షీట్లు కేటాయించాడు. సో.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెలాఖరు నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. మణిశర్మ సంగీతం అందించబోతున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?