లాక్ డౌన్ టైమ్ లో మంచి ప్రశంసలు అందుకున్న చిన్న సిన్మాల్లో కప్పెల (మలయాళం) ఒకటి. ఈ సినిమా రీమేక్ హక్కులను తీసుకుంది సితార ఎంటర్ టైన్ మెంట్స్.
సినిమాలో కీలకమైన రెండు హీరో పాత్రల్లో ఒకదానికి విష్వక్ సేన్ ను ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నారు. మరో పాత్రకు ఎవరు సెట్ అవుతారు అనే ఆలోచనతో వున్నారు.
ఇప్పుడు ఆ పాత్రకు కూడా ఆల్ మోస్ట్ హీరో ఫిక్స్ అయిపోయారు. అరవింద సమేత, భానుమతి రామకృష్ణ సినిమాలతో కెరీర్ ను కాస్త ముందుకు తీసుకెళ్తున్న హీరో నవీన్ చంద్రను ఈ క్యారెక్టర్ కు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
భానుమతి రామకృష్ణ సినిమాలో చాలా బుద్దిమంతుడైన కుర్రాడుగా నవీన్ చంద్ర మెప్పించాడు. ఇప్పుడు కప్పెలలో కూడా అలాంటి క్యారెక్టర్ నే వుంది. అదే నవీన్ చంద్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన అమ్మాయి కీర్తి శెట్టిని తీసుకోబోతున్నారని గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఓ కొత్త దర్శకుడు పని చేస్తారు.