కార్తికేయ కుమ్ముతున్నాడు

గత ఏడాది ‘స్వామి రారా’తో సర్‌ప్రైజ్‌ హిట్‌ కొట్టిన నిఖిల్‌ మరోసారి ఆ ఫీట్‌ రిపీట్‌ చేసాడు… ఈసారి కూడా కొత్త దర్శకుడితో, కొత్త రకం కథతోనే! ‘కార్తికేయ’ ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌…

గత ఏడాది ‘స్వామి రారా’తో సర్‌ప్రైజ్‌ హిట్‌ కొట్టిన నిఖిల్‌ మరోసారి ఆ ఫీట్‌ రిపీట్‌ చేసాడు… ఈసారి కూడా కొత్త దర్శకుడితో, కొత్త రకం కథతోనే! ‘కార్తికేయ’ ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవుతోంది. మొదటి మూడు, నాలుగు రోజుల్లోనే ఈ చిత్రంపై పెట్టుబడి పెట్టిన బయ్యర్లు సేఫ్‌ జోన్‌లోకి వెళ్లిపోయి లాభాలు లెక్క వేసుకుంటున్నారు. 

అన్ని సెంటర్స్‌లోను చాలా స్టడీగా సాగుతున్న ఈ చిత్రం భారీ లాభాల్ని తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూసి మల్టీప్లెక్సుల్లో షోస్‌ పెంచుతున్నారు. అలాగే రెండవ వారంలో మరిన్ని థియేటర్లు యాడ్‌ చేయబోతున్నారు. 

Watch Karthikeya Movie Public Talk

నిఖిల్‌కి సోలోగా ఇది బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌ అవుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్వామి రారా కంటే కూడా దీనికి రెస్పాన్స్‌ బాగుందని, దీనిని మాస్‌ ఆడియన్స్‌ కూడా ఆదరిస్తున్నారని రిపోర్ట్స్‌ వస్తున్నాయి. కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు ఆమోదించరని విమర్శించే వారికి మరొక్కసారి గాట్టి సమాధానమిచ్చింది కార్తికేయ ఘన విజయం. 

Watch Chit Chat With Nikhil and Swathi