కష్టం..నష్టం..అనిల్ సుంకరకే

సంక్రాంతి పండగ కోడిపుంజు సినిమాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో. రెండూ ఒకే రోజు వస్తామంటూ కాలుదువ్వుతున్నాయి. Advertisement ఈ రోజు ఉదయం 10గంటలకు దిల్ రాజు మధ్యవర్తిత్వంలో జరిగే మీటింగ్ లో డేట్…

సంక్రాంతి పండగ కోడిపుంజు సినిమాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో. రెండూ ఒకే రోజు వస్తామంటూ కాలుదువ్వుతున్నాయి.

ఈ రోజు ఉదయం 10గంటలకు దిల్ రాజు మధ్యవర్తిత్వంలో జరిగే మీటింగ్ లో డేట్ ఫైనల్ అవుతుంది. రెండూ 11న వస్తాయా? లేదా ముందు అనుకున్నట్లు 11 లేదా 12న వస్తాయా? అన్నది ఫైనల్ అవుతుంది.

11, 12న వస్తే ఏ సమస్య లేదు. అలా కాకుండా రెండూ 11న వస్తే మాత్రం సరిలేరు…నిర్మాత అనిల్ సుంకర కు చాలా కష్టం..చాలా నష్టం.

ఎలా అంటే..

ఇప్పుడు బయ్యర్లు రేట్ల విషయంలో వెనుకంజ వేయడం పక్కా. సరిలేరు సినిమాను సగటున 38 కోట్ల రేషియోలో ఆంధ్ర లో మార్కెట్ చేసారు. అల వైకుంఠపురములో 36 కోట్ల రేషియోలో మార్కెట్ చేసారు. ఇక్కడ బయ్యర్లు ఎంత కడతారు అన్నది క్వశ్చను. హారిక హాసినికి పెద్దగా సమస్య వుండదు. ఎందుకంటే వాళ్ల చేతిలో వరుసగా సినిమాలు వున్నాయి. పైగా ఈ సినిమాకు ఇంతో అంతో లాభంలో వున్నారు. అదీకాక కృష్ణ,వెస్ట్ గీతా చేతిలో వున్నాయి. ఈస్ట్, నెల్లూరు, గుంటూరు సన్నిహితులకే అమ్మారు. విశాఖ దిల్ రాజు తీసుకున్నారు. వీళ్లంతా రెగ్యులర్ బయ్యర్లు. అందువల్ల ఎంత పంపించమంటే అంతా పంపిస్తారు. 

కానీ అనిల్ సుంకర వ్యవహారం అలాకాదు. వాస్తవం మాట్లాడుకుంటే ఇప్పట్లో మళ్లీ పెద్ద సినిమా లేదు. మహేష్ సినిమా వుంది కానీ ఎప్పుడో? పైగా ఈ సినిమా 11 కోట్ల డెఫిసిట్ లో విడుదలవుతోంది.ఇలాంటి టైమ్ లో బయ్యర్లు కచ్చితంగా కనీసం 10 నుంచి 20 శాతం తగ్గించే కడతారు. ఎందుకంటే బయ్యర్లకు సెంటిమెంట్లు వుండవు. వ్యాపారమే చూస్తారు. ఆ మాటకు వస్తే నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కూడా అంతే.

 పైగా సరిలేరు నీకెవ్వరు సినిమాకు అనిల్ సుంకర సోలో నిర్మాత. దిల్ రాజు పేరు జస్ట్ పోస్టర్ వరకే తప్ప, మరే విధమైన సంబంధంలేదు. ఆ విషయం డిస్ట్రిబ్యూటర్లకు తెలుసు.అదే మహర్షి మాదిరిగా దిల్ రాజు మార్కెట్ చేస్తే వేరుగా వుండేదేమో? కానీ అనిల్ సుంకర నే మార్కెట్ చేసుకున్నారు. 

ఇప్పటికే బయ్యర్ల సర్కిల్ లో ఆ మాట వినిపిస్తోంది. మరోపక్క ఈ డేట్ ల కన్ఫ్యూజన్ వల్ల ఇప్పటికే సింగిల్ షో లు, ఫ్యాన్స్ షో లు వంటి వ్వవహారాలు అన్నీ ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి. సోలోగా వస్తేనే అటు బన్నీ అయినా, ఇటు మహేష్ అయినా అమ్మిన రేట్లకు కాస్త అటు ఇటుగా కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పడు పండగ కాబట్టి దైర్యం వుండొచ్చు.అయినా కూడా ఇలా పోటాపోటీగా వస్తే ఫలితం ఎలా వుంటుందో తెలియదు.ఇలాంటి టైమ్ లో బయ్యర్లు మొహమాటానికి పోరు. తమ సేఫ్ తాము చూసుకుంటారు. 

ఇక అల వైకుంఠపురములో సినిమా విషయానికి వస్తే, కష్టం నష్టం,లాభం ఏదైనా గీతా-హారిక కలిసి పంచుకుంటాయి. ఇప్పటికే ఇంతో అంతో లాభంలో వున్నాయి. రేపు బయ్యర్లు తక్కువ కట్టినా సమస్య రాదు.పైగా అలా కట్టే అవకాశమూ తక్కువనే చెప్పాలి.

హీరోలు ఇగోకి పోవడం వల్ల ఇప్పుడు మంచి మనిషి, మంచి నిర్మాత అయిన అనిల్ సుంకర టెన్షన్ పడాల్సి వస్తుందేమో?

అల్లుడు కంటే మొగుడే గట్టిగా కొడతాడు ఈ పండక్కి