కాటమరాయుడు జిరాక్సేనా?

పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు సినిమా షూట్ చకచకా సాగిపోతోంది. ఈ సినిమా తమిళ సినిమా వీరమ్ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే, ఆయన క్రియేటివ్…

పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు సినిమా షూట్ చకచకా సాగిపోతోంది. ఈ సినిమా తమిళ సినిమా వీరమ్ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే, ఆయన క్రియేటివ్ వర్క్ వుంటుంది. కానీ కాటమరాయుడు విషయంలో అదేమీ లేదని వినికిడి. వీరమ్ సినిమాకు అలా అలా జిరాక్స్ తీసే పనిలో వున్నారట. 

వీరమ్ సినిమా సక్సెస్ మూవీ కావడంతో, ఎక్కడా ఏవీ డీవియేట్ కాకుండా, సీన్ టు సీన్ దింపేస్తున్నారని వినికిడి. పైగా సినిమా చాలా ఫాస్ట్ గా పూర్తి చేసి, త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేయాల్సి వుండడంతో, ఇక మార్పులు చేర్పులు తలపెట్టకుండా చకచకా బండి లాగించేస్తున్నారట. ఈ విషయంలో పవన్ కూడా ఇక అభ్యంతరాలు చెప్పకుండా డైరక్టర్ డాలీ చేతుల్లో పగ్గాలు పెట్టి, బండిని స్పీడుగా లాగించేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

గతంలో గోపాల గోపాలను రీమేక్ గా బాగానే చేసిన అనుభవం ఎలాగూ డాలీకి వుంది కదా? ఇటీవల ధృవ సినిమా కూడా పెద్దగా మార్పులు చేయకుండా , పైగా డైలాగులు దాదాపు ట్రాన్స్ లేట్ చేసి వాడేసారు. జనాలకు నచ్చింది. అందువల్ల అదే పాట్రన్ ను ఇక్కడా ఫాలో అయిపోతున్నారేమో?