చోలీకే పీచే క్యా హై.. అని బాలీవుడ్ వాళ్లు ఒకప్పుడెప్పుడో పాట రాస్తే, దేశం మొత్తం అవాక్కైంది! అప్పటికి అది సంచలనం. అయితే… క్రమంగా అలా అడగాల్సిన అవసరాన్ని తగ్గించేస్తూ పోతున్నారు బాలీవుడ్ భామామణులు.
ఎక్స్ పోజింగ్ .. అందాల ఆరబోత.. అంటే అది సినిమాల కోసం మాత్రమే చేసే పని కాదు.. కేవలం షూటింగ్ సమయాల్లోనే అలా కనిపిస్తే సరిపోదు, మిగతా సమయాల్లో కూడా వీలైనంతగా అందాలను ఆరేస్తుంటేనే.. ఆరబోత అలవాటవుతుంది అన్నట్టుగా ఉంది మారింది వీరి తీరు.
స్టార్ డస్ట్ అవార్డ్స్ కార్యక్రమం వద్ద జాక్వెలిన్ ఫెర్నాండేజ్ రెడ్ కార్పేట్ అప్పీరియన్స్ ఇది. ఉల్లిపొరలాంటి డిజైనర్ వేర్ లో మెరిసింది ఈ భామ. ఇదే కార్యక్రమానికి దాదాపు ఈ తరహా దుస్తుల్లోనే హాజరైంది సోనమ్ కపూర్. సభ్యత పరంగా చూసుకుంటే.. జెక్వెలిన్ డ్రస్సే కొంచెం మెరుగు. సోనమ్ మరీ అతిగా తయారైందిగా! అందాల ప్రదర్శన విషయంలో హద్దులు దాటి కంపరం పుట్టిస్తోంది అనిల్ కపూర్ తనయ.