అధికారికం.. కత్రినాకైఫ్, రణ్ భీర్ కపూర్ లు విడిపోయారహో..అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. మొన్నటి వరకూ ప్రేమలో మునిగి తేలి.. విదేశీ బీచ్ లో సరదాగా గడుపుతూ మీడియాకు కూడా కనిపించిన ఈ బాలీవుడ్ హీరోహీరోయిన్ల గురించి తాజా అప్ డేట్ ఇది. ఇన్ని రోజులూ సహజీవనం చేసిన ఈ జంట ఎవరికి వారయ్యిందని.. తామిద్దరం కలిసి ఉన్న ప్లాట్ నుంచి రణ్ భీర్ ఖాళీ చేసి వెళ్లిపోయాడని..తన తల్లిదండ్రుల వద్దకు అతడు వెళ్లిపోయాడని ముంబై సమాచారం.
కత్రినా, రణ్ భీర్ ల ప్రేమల కథ గురించి కొత్తగా వివరించాల్సిన పనేం లేదు. చాలా నెలల నుంచే వీరి అనుబంధం వెలుగులోకి వచ్చింది. తమ ప్రేమను వాళ్లిద్దరూ ధ్రువీకరించారు కూడా. కేవలం ధ్రువీకరించడమే కాదు.. తాము వివాహం చేసుకోబోతున్నామని కూడా ప్రకటించారు. పెళ్లి చేసుకోబోతున్న హీరోహీరోయిన్లుగా వీళ్ల గురించి మీడియా లో కూడా కథనాలు వచ్చాయి. అయితే.. నిశ్చితార్థాలు, పెళ్లి .. ఇప్పుడప్పుడే కాదు.. అని వీళ్లు ప్రకటించేసి సగం బరువు దించేసుకున్నారు. ఇప్పుడేమో..బ్రేకప్ వార్తలు వచ్చేస్తున్నాయి. అయినా ఈ ఇద్దరికీ కూడా ప్రేమా కొత్త కాదు.. బ్రేకప్పూ కొత్త కాదు కదా! వీళ్ల మాజీ ప్రేయసీ ప్రియులే దానికి సాక్షి.