ఒకప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన కరిష్మా కపూర్ వైవాహిక జీవితం గత కొంతకాలం నుంచి వివాదాలు కొనసాగుతున్న విషయం విదితమే. పారిశ్రామిక వేత్త సంజయ్ కపూర్ ను వివాహం చేసుకుని కరిష్మాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొంతకాలం కిందట ఈ జంట వేరు పడింది. విడాకులకు పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. అయితే అంతలోనే రాజీకి కూడా వచ్చినట్టుగా ప్రకటించుకున్నారు కూడా! కానీ ఇప్పుడు మళ్లీ సంజయ్ కపూర్ విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ఒకింత దారుణమైన ఆరోపణలే చేశాడు ఆ వ్యాపారవేత్త.
కరిష్మ కేవలం తనను డబ్బు కోసమే వివాహం చేసుకొందని సంజయ్ ఆరోపించాడు. తను పేరు పొందిన ఇండస్ట్రియలిస్టును కావడంతోనే ఆమె తనను వివాహం చేసుకుందని.. ఇతడు పిటిషన్ లో పేర్కొన్నాడు. అంతేకాదు.. కరిష్మా ఎఫైర్స్ గురించి కూడా ఇతడు పిటిషన్లలో పేర్కొన్నాడు. తనతో వివాహానికి ముందు కరిష్మాకు అభిషేక్ బచ్చన్ తో సన్నిహిత సంబంధాలుండేవని.. సంజయ్ కపూర్ ఇప్పుడు గగ్గోలు పెట్టాడు.
బాలీవుడ్ లో పేరెన్నిక కలిగిన కుటుంబం నుంచి వచ్చి అదే ఇండస్ట్రీలో వెలుగొందిన కరిష్మా .. అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ తో వివాహా నిశ్చితార్థం చేసుకున్న విషయం విదితమే. ఆ ఎంగేజ్మెంట్ పెళ్లి వరకూ వెళ్లలేదు. తదనంతర కాలంలో కరిష్మా సంజయ్ ను వివాహం చేసుకుంది. వాళ్లకు ఇద్దరు పిల్లలు కూడా కలిగారు.
గత కొంతకాలంగా ఒడిదుడుకులతో సాగుతున్న వీరి కాపురం విడాకుల వరకూ వచ్చింది. సినీ కుటుంబాల్లో ఇలాంటివి కొత్తేమీ కాదు కానీ… సంవత్సరాల పాటు తనతో కాపురం చేసిన భార్య విషయంలో సంజయ్ ఇలాంటి ఆరోపణలు చేయడం విడ్డూరం. మరి కరిష్మా సంజయ్ వద్ద డబ్బు ఉందనే వివాహం చేసుకుని ఉండవచ్చు.. ఇలా వాదించే సంజయ్ కరిష్మాలో దేన్ని చూసి పెళ్లి చేసుకున్నాడో కూడా కోర్టుకు చెబితే మంచిదేమో!