బోలెడు లేపేసారట

నాగ్ సినిమా సోగ్గాడే చిన్న నాయనా..విడుదలైంది..జనాలకు బాగానే నచ్చేసింది. కానీ ఒక్కటే చిన్న డిస్సపాయింట్ మెంట్. కేవలం గుడిలో ఇరవై పాతిక లక్షలు విలువ చేసే ఆభరణాల కోసమా, దేవాదాయశాఖ, పోలీసు శాఖ, హీరో…

నాగ్ సినిమా సోగ్గాడే చిన్న నాయనా..విడుదలైంది..జనాలకు బాగానే నచ్చేసింది. కానీ ఒక్కటే చిన్న డిస్సపాయింట్ మెంట్. కేవలం గుడిలో ఇరవై పాతిక లక్షలు విలువ చేసే ఆభరణాల కోసమా, దేవాదాయశాఖ, పోలీసు శాఖ, హీరో ఇలా ఇంతమందిని చంపేసింది. పైగా యముడు కూడా అక్కడి నుంచి ఇక్కడకి భగవంతుడు ఆజ్ఙ అంటూ ఆత్మను పంపింది..అంత బలంగా లేదు పాయింట్ అన్నది ఒక్కటే.

అయితే దీని వెనుక వ్యవహారం వేరుగా వుందని వినికిడి. నిర్మాత రామ్మోహన్ ఈ కథను తయారుచేసాడు. దాన్ని నాగ్ కు చెప్పినపుడు, అందులో దేవాలయంలోని గదిని రెండుతాళాలతో తెరిచేసరికి, దాన్నిండా తిరువనంతపురం ఆలయం మాదిరిగా భయంకరమైన బంగారు సామగ్రి అంతా వుంటుందట. కానీ మరి చిత్రీకరణ ఆ దిశగా జరిగే, మళ్లీ మార్చేసారని వినికిడి.అంతే కాదు, ఈ ఫన్, రొమాంటిక్ వ్యవహారాలు కాకుండా కథకు సంబంధించి ఇంకా చాలా సీన్లు చిత్రీకరించారని, కానీ వాటిని ఫైన్ ట్యూన్ చేసినపుడు లేపేసారని తెలుస్తోంది. కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి..ఎంత తీసినా, ఎంత కోసినా, కాస్త కన్విన్సింగ్ గా బాగానే చేయగలిగారు.

మూడు ముక్కల గుడి

సినిమాలో కనిపించే గుడి మూడు చోట్ల అంటే కాస్త అపనమ్మకంగా వుంటుంది. గుడి బయట  భాగం మైసూర్ సమీపంలోది. ఇంటీరియర్ అన్నపూర్ణ స్టూడియోలో. అంటే శివుడి లింగం, విగ్రహం, ఆభరణాల గది అన్నీ. ఇక మైసూర్ సమీపంలోని గుడికి గోపురం లేదట. దాంతో గోపురాన్ని సీజీలో జోడించారు. అదీ సంగతి. ఆ పల్లెటూరు చూసి మన ఈస్ట లేదా వెస్ట్ గోదావరి అనుకుంటాం..అది కూడా మైసూర్ సమీపంలోని విలేజే నంట.