‘కత్తి’ నూరద్దు అన్నా చిరు వినడం లేదట

కత్తి సినిమా..పాపం ఠాగోర్ మధు ఏ ముహూర్తాన కొన్నారో కానీ, తెలుగు ప్రేక్షకులు దాన్ని చూడడం జరగడం లేదు. ఆఖరికి ఇప్పుడు అది మెగాస్టార్ చిరంజీవికి చేరింది. మెగాస్టార్ అమితంగా నమ్మే పరుచూరి సోదరులు…

కత్తి సినిమా..పాపం ఠాగోర్ మధు ఏ ముహూర్తాన కొన్నారో కానీ, తెలుగు ప్రేక్షకులు దాన్ని చూడడం జరగడం లేదు. ఆఖరికి ఇప్పుడు అది మెగాస్టార్ చిరంజీవికి చేరింది. మెగాస్టార్ అమితంగా నమ్మే పరుచూరి సోదరులు దాన్ని, ఆయనకు నప్పే విధంగా మార్చే ప్రయత్నంలో వున్నారు. వివి వినాయక్..ఊ అంటే డైరక్షన్ కు రెడీగా వున్నారు. 

కానీ అసలు విషయం వేరే వుందట. కత్తి సబ్జెక్ట్ చిరంజీవికి సూట్ కాదని ఆయనకు దగ్గర జనాలు చాలా మంది చెప్పడానికి ట్రయ్ చేసారట. కానీ ఆయన వినలేదట. ఆఖరికి కత్తి ఒరిజినల్ సృష్టి కర్తే మురగదాస్ నే చెప్పాడట..ఇది కాస్త టాలెంటెడ్ యంగ్ స్టార్ ఎవరైనా చేస్తే బాగుంటుంది.. సబ్జెక్ట్ అలాంటిది.. మీకు అంతగా సూట్ కాకపోవచ్చు అని.

 అయినా కూడా చిరంజీవి తానే చేస్తానని, తన ఏజ్ కు అనుగుణంగా మార్చుకుంటానని అంటున్నారట. సబ్జెక్ట్ ఆయనను అంతగా ఇన్ స్పయిర్ చేసి వుండొచ్చు. అయినా అంత మాత్రం చేత తన వయస్సుకు సూట్ అవుతుందా లేదా అన్నది చూడాలి కదా?