సైలెంట్ మోడ్ లో కోన?

కోన వెంకట్.. టాలీవుడ్ రైటర్ కమ్ డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్. ఇప్పుడు ఆయన ఓ స్క్రిప్ట్ తయారీలో బిజీగా వున్నారని వినికిడి. కోన వెంకట్ ఇప్పుడు ఎవరు కాంట్రాక్టు చేయాలన్నా బిజీ టోన్ వస్తోందట.…

కోన వెంకట్.. టాలీవుడ్ రైటర్ కమ్ డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్. ఇప్పుడు ఆయన ఓ స్క్రిప్ట్ తయారీలో బిజీగా వున్నారని వినికిడి. కోన వెంకట్ ఇప్పుడు ఎవరు కాంట్రాక్టు చేయాలన్నా బిజీ టోన్ వస్తోందట. ఆయన తన ఫోన్ డోంట్ డిస్ట్రబ్ మోడ్ లో పెట్టి వుంటారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. 

అయితే కోన వెంకట్ ఇప్పుడు ముంబాయ్ లో వున్నారని, ఓ మాంచి పకడ్బందీ స్క్రిప్ట్ తయారు చేసి, తనేంటో నిరూపించుకునే పనిలో వున్నారని తెలస్తోంది. అందుకే ఆయన ఏ డిస్ట్రబెన్స్ లేకుండా ఫోన్ కాల్ కు కూడా దొరకకుండా వర్క్ చేస్తున్నారట. నిజానికి కోన వెంకట్ ను తక్కువ అంచనా వేయడానికిలేదు. 

ఇండస్ట్రీలో ఓ సక్సెస్ ఫుల్ ఫార్ములా అంటూ కొన్ని పదులు సినిమాలు రావడానికి కారణమైన లైన్ ను ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. ఎటొచ్చీ మన జనాలు తెగ బోర్ కొట్టేదాకా దాన్ని వాడి పారేసారు. ఇప్పుడు మరి ఇంత ఒంటరిగా వర్క్ చేస్తూ, మరే కొత్త ఫార్ములాకు ప్రాణం పోస్తున్నారో కోన?