శంకరాభరణంతో తన హిట్ మూవీల జర్నీకి బ్రేక్ పడింది నిఖిల్ కు. అందుకే ఈసారి చాలా జాగ్రత్తగా సబ్జెక్ట్ లు ఎంచుకుంటున్నాడు. అందులో భాగంగా, టైగర్ సినిమా అందించిన ఆనంద్ చెప్పిన లైన్ కు ఓకె చేసాడు. మంచి కథ, ముగ్గురు హీరోయిన్లు..అంతా బాగానే వుంది. కానీ ఇప్పుడు ఈ సినిమాను నిర్మిద్దామనుకున్న నిర్మాత, ఇంత బడ్జెట్ తన వల్ల కాదు అని అంటున్నాడని వినికిడి.
గుంటూరుకు చెందిన ఓ కొత్త నిర్మాత నిఖిల్ తో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. సరే అని ఈ సినిమా ఆయనకు ఇచ్చారు. కానీ ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లు, కాస్త హెవీ సబ్జెక్ట్ కావడంతో ఆ నిర్మాత ముందు వెనుకలు ఆడుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే నిఖిల్ ఓకె చేసిన నిర్మాతలు ఇంకా ఒకరిద్దరు వున్నారు. మరి వారెవరైనా లైన్ లోకి వస్తారో, ఈ నిర్మాతే చేస్తారో..చూడాలి. ఈ శషభిషలేకుంటే ఈపాటికి సినిమా సెట్ మీదకు వెళ్లిపోయి వుండాలి. కానీ అలా జరగలేదు.