Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కీరవాణి.. వర్మతో కలిసినందుకు

కీరవాణి.. వర్మతో కలిసినందుకు

పాపం, కీరవాణి భక్తిపరమైన సంగీతం అందించిన మేథస్తుతోనే గాడ్ సెక్స్ ట్రూత్ సినిమాకు సంగీతం అందించి ఇప్పుడు వార్తల్లోకి, గాసిప్స్ లోకి ఎక్కిపోయారు. బాహుబలి సంగీత దర్శకుడిగా ప్రపంచానికి పరిచయం అయిన ఆయన, ఓ పోర్నో సినిమాకు సంగీతం అందించడం ద్వారా అనవసరపు వివాదాల్లోకి తన పేరు కూడా చేరేలా చేసుకున్నారు. 

వర్మను విచారించిన పోలీసులు ఇప్పుడు కీరవాణిని కూడా విచారించక తప్పదు. ఎందుకంటే వర్మ ఆ సినిమా తానే చేసాను అని అనేసి వుంటే అది వేరుగా వుండేది. అలా కాకుండా తాను చేయలేదని, డబ్బులు తీసుకోలేదని అనడం ద్వారా పోలీసులు పరిశోధనకు కాస్త గట్టిపనే పెట్టారు. 

ఇప్పుడు వర్మ ఆ సినిమా ఎక్కడ తీసాడు? కీరవాణిని వర్మ కాంట్రాక్టు చేసాడా? లేక నిర్మాతలు ఎవరైనా కాంట్రాక్టు చేసారా? పారితోషికం ఇచ్చారా? లేదా? సినిమాను రీరికార్డింగ్ కు కీరవాణికి ఎవరు పంపారు? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతాయి. మరి ఈ మేరకు పోలీసులు కీరవాణిని కూడా ప్రశ్నిస్తారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

సాధారణంగా వివాదాలకు దూరంగా వుండే కీరవాణి ఇప్పుడు ఇరుక్కున్నారు. పైగా కీరవాణి వెంకటేశ్వర భక్తి చానెల్ లో రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు. ఓ పోర్నో సినిమాకు పనిచేసిన కీరవాణిని భక్తిపాటలకు కూడా సంగీతం అందించడం అంటే జనాలకు కాస్త ఇబ్బందిగానే వుంటుందేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?