Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రంగస్థలానికి మరికొన్ని డేట్లు ప్లీజ్

రంగస్థలానికి మరికొన్ని డేట్లు ప్లీజ్

రంగస్థలం ముస్తాబు అంత సులువుకాదు. ఎంత డెకరేట్ చేసినా ఇంకా చేయాలని అనిపిస్తూనే వుంటుంది. బహుశా అదే స్ఫూర్తితో కావచ్చు దర్శకుడు సుకుమార్ రంగస్థలం సినిమాను ఏళ్ల తరబడి చెక్కుతూనే వున్నారు. హమ్మయ్య అయిపోయింది, రీ రికార్డింగ్ మాత్రం తరువాయి అనుకుంటే, మళ్లీ రెండు మూడురోజులు షూటింగ్ వర్క్ వుందని తెలుస్తోంది.

ఒకపక్క హీరో రామ్ చరణ్ గెడ్డం తగ్గించారు. ఆయన పనుల మీద ఆయన వున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో బోయపాటి సినిమా మీదకు వెళ్తారని టాక్ వుంది. ఇలాంటి టైమ్ లో రంగస్థలం మరింత ముస్తాబు కోసమో, రిపేర్ల కోసమో మూడు నాలుగు రోజులు షూటింగ్ అవసరం పడిందని తెలుస్తోంది. 

ఈ మేరకు బోయపాటి యూనిట్ కు సమాచారం అందినట్లు బోగట్టా. జస్ట్ కాస్త రెండు మూడు రోజలు అడ్జస్ట్ చేసుకోమని రంగస్థలం టీమ్ కోరినట్లు తెలుస్తోంది. బోయపాటి టీమ్ ను అడిగారు అంటే, షూటింగ్ కోసం రామ్ చరణ్ అవసరం అనుకోవాలి. మరి రామ్ చరణ్ ఆ మేరకు రెడీ అవుతున్నారా? మొత్తంమీద విడుదల టైమ్ వరకు దర్శకుడు సుకుమార్ చెక్కుతూనే వుంటారేమో రంగస్థలం శిల్పాన్ని.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?