ఆరెంజ్ ఫలితం రామ్‌చరణ్‌కి ఇంకా వెంటాడుతోంది. ప్రయోగాల జోలికి వెళ్లడానికి ఇంకా వణికేస్తున్నాడు. అందుకే సేఫ్ గేమ్ ఆడేస్తున్నాడు. మాస్, యాక్షన్ కథలు చరణ్‌కి విజయాలు తీసుకొస్తుండడంతో అలాంటి కథలే కావాలని పట్టుపడుతున్నాడట.
రచ్చ, నాయక్, ఎవడు.. ఇవి కూడా ఒకే ఫార్మెట్‌లో వెళ్లే కథలు కాకపోయినా మెయిన్ ఎలిమెంట్స్ మాత్రం ఒక్కటే. రేపు చేయబోయే బోయపాటి శ్రీను సినిమా కూడా ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్ టైన్‌మెంటే నట. కృష్ణవంశీ సినిమాలో కూడా మాస్ అంశాలు ఉండేలా జాగ్రత్తపడుతున్నాడని సమాచారమ్. నిజానికి చరణ్ కోసం కృష్ణవంశీ ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ని తయారు చేసుకొన్నాడు.
అందులోనూ… చరణ్ తరహా అంశాలు ఉంటాయట. ఇవన్నీ కేవలం చరణ్ ఆసక్తిమీదే కథలో జోడించినట్టు తెలుస్తోంది. మరి చరణ్ చేస్తున్న ఈ మార్పులూ చేర్పులూ కథకు ఉపయోగపడతాయా?? లేదంటే కథను పాడు చేస్తాయా?? అనేది తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాలి.